Largest Diamond :చీకటి ఖండంలో వెలుగులు..ఆఫ్రికాలో లభించిన ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వజ్రం..

ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో 1,098 క్యారెట్ల వజ్రం లభించింది. ప్రపంచంలో మొదటి అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోనే లభించగా.. రెండోది అక్కడే లభించింది. ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా అక్కడే దొరకటం విశేషం.

Largest Diamond :చీకటి ఖండంలో వెలుగులు..ఆఫ్రికాలో లభించిన ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వజ్రం..

Worlds Third Largest Diamond

Worlds Third Largest Diamond: సాధారణంగా వజ్రం అనే మాట వినిపిస్తేనే మన కళ్లు జిగేల్ మని మెరుస్తాయి. అటువంటిది పేద్ద వజ్రాన్ని చూస్తే..నోరెళ్లబెట్టాల్సిందే. అటువంటి ఓ అరుదైన అద్భుతమైన వజ్రం కనుకొన్నారు నిపుణులు. చీకటి ఖండం వజ్రాల వెలుగులతో గుభాళిస్తోంది. ప్రంపంచంలోని అతి పెద్ద వజ్రాలకు పుట్టిల్లుగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. వజ్రాలను గర్భంలో దారుచుకున్నా గానీ ఆఫ్రికా దేశాలు కరవుతో కొట్టుమిట్టాడటం విచారించదగిన విషయం. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశంలో మరో వజ్రానికి జన్మనిచ్చింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో లభించింది.

ఈ వజ్రం 1,098 క్యారెట్ల వజ్రం. ఇంకా పేరు పెట్టని ఈ వజ్రం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వజ్రాల వ్యాపారుల మాట్లాడుకుంటున్నారు. సాధాణంగా వజ్రాలను సాన బెడితేనే వాటి విలువ తెలుస్తుందంటారు. కానీ ఆఫ్రికా ఖండపు దేశాల్లో లభించే అరుదైన వజ్రాలు రా మెటీరియల్‌లా ఉన్నప్పుడే జిల్‌జిగేల్‌ మంటాయి. అందుకే ఆఫ్రికాలో లభించే వజ్రాలకు అంత గిరాకీ ఉంటుంది. ప్రపంచంలో మొదటి అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోనే లభించగా.. రెండోది అక్కడే లభించింది. ఐతే ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా అక్కడే దొరకటం విశేషం.

ఈ వజ్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ప్రత్యేక విషయం ఏమిటంటే..దీనికి ముందు..ప్రపంచంలోనే అత్యంత పెద్ద వజ్రాలు రెండూ ఆఫ్రికాలో లభించటం. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రం 3,106 క్యారెట్లు 1905 లో ఆఫ్రికాలో కనుగొన్నారు. దీనికి కులియన్ స్టోన్ అని పేరు పెట్టారు. అలాగే 1109 క్యారెట్ల రెండవ అతిపెద్ద వజ్రం 2015 లో బోట్స్వానాలో కనుగొనబడింది. దీనికి లెసిడి-లా-రోనా అనే పేరు పెట్టారు. ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా బోట్స్వానా లోనే లభించడం మరో విశేషం. ఈలెక్క చూస్తుంటే బోత్స్వానా వజ్రాల ఖజానా ఉంది. వజ్రాలను తన కడుపులోదాచుకున్న బోత్స్వానా మీదే ఇప్పుడు అందరి దృష్టి పడింది. కొత్తగా కనిపెట్టిన ఈ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ వజ్రంగా రికార్డు సాధించింది.

ఇంకా పేరు పెట్టిని ఈ అతి పెద్ద వజ్రం… ఆంగ్లో అమెరికన్ మరియు బీర్స్, స్థానిక ప్రభుత్వం కలిసి జరిపిన తవ్వకాల్లో కనుగొన్నారు. ఈ వజ్రాన్ని డెబ్స్వానా డైమండ్ కంపెనీ వారు స్వాదీనం చేసుకుని ఆ తరువాత దాన్ని ఆ దేశ అధ్యక్షుడు మోక్వీట్సీ మాసిసీకి అప్పగించారు. మొదటి రెండు ఆఫ్రికా వజ్రాలతో పాటు ఈ మూడవ అతి పెద్ద వజ్రం కూడా ఆఫ్రికాకు చెందినదే కావడం హైలైట్. మూడో అతి పెద్ద వజ్రాన్ని 1098 క్యారెట్లుగా గుర్తించారు. దీని పొడవు 73 మిల్లీమీటర్లు కాగా.. వెడల్పు 52 మిల్లీ మీటర్లు 27 మిల్లీ మీటర్ల వెడల్పు కలిగిఉంది.

ఈ వజ్రాన్ని కనిపెట్టిన వారు..ప్రభుత్వం కలిసి ఈ మూడో అతిపెద్ద వజ్రానికి పేరు ఖరారు చేయనున్నారు. కాగా..కరోనా ప్రభావం వజ్రాల అమ్మకాల మీద కూడా భారీగా పడింది. అమ్మకాలు భారీగా తగ్గిపోయాయ్. దీంతో డైమండ్ వ్యాపారుల లావీదేవీలు కూడా తగ్గాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పడు లభించిన ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం దొరకడంపై సంతోషం వెల్లువెత్తుతోంది. మళ్లీ వజ్రాల వ్యాపారాలకు మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇక వజ్రాల వ్యాపారం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై బాకీ డెబ్స్వానా డైమండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడుతూ ప్రాథమిక పరిశోధనలలో ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం అని తేలిందని తెలిపారు. అలాగే దీనిపై గనుల మంత్రి లెఫోకో మోగి మాట్లాడుతూ..ఈ వజ్రానికి ఇప్పటి వరకు పేరు పెట్టబడలేదని త్వరలోనే మంచి పేరు నిర్ణయించి పెడతామని తెలిపారు. కాగా వజ్రాల ఆదాయంలో ప్రభుత్వానికి 80 శాతం దేబ్స్వానా డైమండ్ కంపెనీ చెల్లించాలి. 2020 లో కంపెనీ ఉత్పత్తి 29 శాతం తగ్గింది. అదే సమయంలో అమ్మకాలలో 30 శాతం క్షీణత ఉంది.