World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది

ఆ కుక్క ముఖం చాలా భయానకంగా ఉంది. మొత్తం కణతులు ఉన్నాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది. దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది.

World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది

Ugliest Dog

World’s Ugliest Dog : అమెరికా కాలిఫోర్నియాలో అత్యంత అసహ్యమైన కుక్కల కాంపిటీషన్ జరిగింది. అరిజోనాకు చెందిన 17ఏళ్ల చివావా మిక్స్ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైన కుక్కగా ఎంపికైంది. ఆ కుక్క ముఖమంతా కణతులు ఉన్నాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది. దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది. అయితే, ఈ కుక్క మరో నెల రోజులు మాత్రమే జీవించగలదని జెనెడా తెలిపింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాలిఫోర్నియాలో అత్యంత అసహ్యమైన కుక్కల పోటీ దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతోంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ పోటీ జరిగింది. ఈ శునకానికి దంతాలు లేవు. జుట్టులేదు. “హైనా” లాగా, “గొరిల్లా” లాగా కనిపిస్తోంది. ఈ కుక్కను 2021 అగస్టులో దత్తత తీసుకున్న యజమాని తెలిపింది.

Dogs Wedding: పెంపుడు కుక్కల పెళ్లి అదుర్స్.. భారీగా తరలివచ్చిన అతిథులు.. ఎక్కడంటే..

నిద్రపోవడం, గురక పెట్టడం, సంతోషంగా ఉన్నప్పుడు శబ్దాలు చేయడం ఆ కుక్క హాబీస్ అని తెలిపింది. ఈ పోటీలో విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలాగే న్యూయార్క్ సిటీ ట్రిప్ అవకాశం ఇచ్చారు.

కరోనా సేఫ్టీ పాడ్స్‌తో జిమ్‌లు రెడీ.. ఎగబడుతున్న కస్టమర్లు!