Worldwide Corona Cases : ప్రపంచ వ్యాప్తంగా 1,78,581,229 కరోనా కేసులు

Worldwide Corona Cases : ప్రపంచ వ్యాప్తంగా 1,78,581,229 కరోనా కేసులు

Worldwide Corona Cases

Worldwide Corona Cases : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరణాలు భయపెడుతున్నాయి.

అగ్రదేశంగా పేరొందిన అమెరికా కరోనాతో కకావికలం అయింది. ఇప్పటికి ఇక్కడ వేలల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అనేక దేశంలో ఇప్పటికి కరోనాతో పోరాడుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో మాత్రమే కరోనా అదుపులోకి వచ్చింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పాజిటివ్ కేసుల విషయానికి వస్తే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలుపుకొని శనివారం వరకు 1,78,581,229 కేసులు నమోదయ్యాయి. శనివారం ప్రపంచ వ్యాప్తంగా 3,97,590 మందికి కరోనా సోకినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికోలది 50 శాతం వాటా ఉంది. ఇక కరోనా ప్రభావానికి లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా ప్రభావం ఈ దేశాలపై అధికంగా ఉన్నట్లు తాజాగా అంతర్జాతీయ వార్తాపత్రికలు పేర్కొన్నాయి.

గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 43 మంది లాటిన్ అమెరికా దేశస్థులేనని అంతర్జాతీయ వార్త పత్రికలు తెలిపాయి. ఇక బొలీవియా, చిలీ, ఉరుగ్వేల్లో కరోనా బారిన పడిన పేషెంట్లలో 25 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న వారు అధికంగా ఉన్నట్లుగా తెలిపాయి. బ్రెజిల్ రాజధాని సావోపోలోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 80 శాతం కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. ఇక ఆఫ్రికా దేశాల్లో కూడా కరోనా విలయతాండవం కొనసాగుతుంది.