Worst Wedding Ever : కాసేపట్లో పెళ్లి.. వరుడిపై వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు.. ఇదో పరమ చెత్త వివాహం..!

కాసేపట్లో పెళ్లి.. వరుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి పనులన్నీ సజావుగా జరిగాయి. పెళ్లి తంతు జరుగుతోంది.

Worst Wedding Ever : కాసేపట్లో పెళ్లి.. వరుడిపై వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు.. ఇదో పరమ చెత్త వివాహం..!

Worst Wedding Ever

Worst Wedding Ever : కాసేపట్లో పెళ్లి.. వరుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి పనులన్నీ సజావుగా జరిగాయి. పెళ్లి తంతు జరుగుతోంది. ఇంతలో వరుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడి కళ్ల ముందే వధువు కిందపడిపోయింది. ఆ తర్వాత వాంతి కూడా చేసుకుంది. దీంతో ఆ వరుడు కాస్త అప్ సెట్ అయ్యాడు. ఏం జరిగిందో అర్థం కాక పెళ్లికి వచ్చిన గెస్టులు కూడా అయోమయంలో పడిపోయారు. అసలేం జరిగిందంటే…

అమెరికా మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్‌లు‌ వివాహం చేసుకుందామని భావించారు. డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్నీ వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది.

బయట బాగా వేడిగా ఉండటం వల్ల హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్‌ ఆన్‌ చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్‌ దగ్గరకు వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి ఆ బుడ్డోడు హోలీ మీద మల విసర్జన చేశాడు.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఆ త్వరగా పెళ్లి తంతు ముగించుకుని ఆస్పత్రికి వెళ్లింది హోలీ. లో బీపీ, రక్తహీనత కారణంగా హోలీ కళ్లు తిరిగి పడిపోయిందని డాక్టర్లు తెలిపారు. పెళ్లి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు వివరించారు.