Oscar Nominat ‘Writing with Fire’:ఆస్కార్‌ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు..సెల్‌ఫోనే వారి కెమెరా..

 ఆస్కార్స్ 2022లో నామినేషన్ లో 'రైటింగ్ విత్ ఫైర్'ఎంపికైంది. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్‌ లెహరియా’ పత్రికపై రూపొందించిన డాక్యుమెంటరీ ఈ 'రైటింగ్ విత్ ఫైర్'.

Oscar Nominat ‘Writing with Fire’:ఆస్కార్‌ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు..సెల్‌ఫోనే వారి కెమెరా..

Oscar Nominat ‘writing With Fire'

Oscar Nomination 2022..’Writing with Fire : ఆస్కార్స్ 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీ ఎంపికైంది. అదే ‘రైటింగ్ విత్ ఫైర్’. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్‌ లెహరియా’ న్యూస్‌పేపర్‌ (వీక్లీ) గురించి..దాంట్లోని డిజిటల్‌ వార్తల గురించి రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్స్ 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఎంపికైంది. ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’…. ఆస్కార్‌ 2022 బరిలో భారతదేశం నుంచి షార్ట్‌ లిస్ట్‌ అయిన బెస్ట్‌ డాక్యుమెంటరీ మూవీ.

‘ఖబర్‌ లెహరియా’ న్యూస్‌పేపర్‌ (వీక్లీ)లో పనిచేసేవారంతా మహిళా జర్నలిస్టులే. పైగా వారంతా దళితులు. దీంట్లో పనిచేసే 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు మహిళా కోణంలో (ఉమెన్ యాంగిల్) అందిస్తుంటారు. యూపీతో పాటు బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను మహిళా కోణంలో తెలియజేస్తుంటారు. దీనిపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ సాధించే సత్తా ఉందనే ధీమా ఏర్పడింది. ఆస్కార్ 2022 వేడుక మార్చి 27న జరగనుంది. ఈ సందర్బంగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బుధవారం (డిసెంబర్ 22,2021)10 విభాగాల్లో తన షార్ట్‌లిస్ట్‌లను వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన ఫిల్మ్ మేకర్స్ రింటు థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే డాక్యుమెంటరీ 94వ అకాడమీ అవార్డుల డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 138 చిత్రాల నుండి ఎంపిక చేయబడిన 15 చిత్రాలలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. దీంట్లో ఎంపికైంది ‘రైటింగ్ విత్ ఫైర్’.

ఈ సందర్భంగా..ఖబర్‌ లహరియా వీక్లీలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్టు మాట్లాడుతు..‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. మనం కూడా అలా చేయవచ్చనే ఆలోచనే వారికి రాదు. కానీ ఈ 20 ఏళ్లలో అటువంటి ఆలోచనను మేం తీసేయగలిగామని అన్నారు.ఈ వీక్లీ గురించి ఆమె ఇంకా మాట్లాడుతు..2002లో ‘ఖబర్‌ లహరియా’ వారపత్రిక బుందేల్‌ ఖండ్‌లోని చిత్రకూట్‌ మొదలైందని..అప్పుడు ఆరుగురు దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం ప్రారంభించారని కానీ ఇప్పుడు 25 మంది పని చేస్తున్నారని తెలిపారు.

ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా పెరిగారో..హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో..ఆ తర్వాత సెల్‌ఫోన్లను కెమెరాలుగా ఉపయోగిస్తు..డిజిటల్‌ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించరో వంటి ఎన్నో కీలక విషయాలను అత్యంత అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ అని తెలిపారు. రింతు థామస్‌,సుస్మిత్‌ ఘోష్‌తో దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ 2022మార్చి 27న లాస్‌ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్‌ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉంది.

2022 సంవత్సరానికి ఆస్కార్‌ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఒకటిగా నిలిచింది. ఈ షార్ట్‌లిస్ట్‌ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్‌ జరగనుంది. అలా రైటింగ్ విత్ ఫైర్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంది. ఆస్కార్ బరిలో నిలిచింది.

ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్‌ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఉంటే ఆస్కార్‌ వేడుకలో గెలుపు సాధించాల్సి ఉంది. ‘లగాన్‌’, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రాల తర్వాత ఆస్కార్‌ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించనేలేదు. అసలు ఆ దరిదాపులకు కూడా పోనేలేదు. కాని ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. భారత్ కు దళిత మహిళా జర్నలిస్టుల కష్టం..ఇష్టం..అవార్డు సాధించటానికి అడుగు దూరంలో ఉంది.

ఖబర్‌ లహరియాపై డాక్యుమెంటరీ
ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‌‘ అనే ఎన్‌జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్‌ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం అంటే కూడా ఏంటో తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంతంలో జరిగే ఘటనలను ఎలా జర్నలిజం కోణంలో చూస్తారో..వాళ్లు చూసిన పద్ధతిలో పాఠకులకు ఎలా చేరువ చేస్తారో.. అనేది విశేషం. ఈ పత్రిక ఉద్దేశం కూడా అదే. అంతే కాదు..జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని నిరూపించిన ఎన్నెన్నో ఘటనల్ని సంఘటనలకు చూపించడమే దీన్ని ఉద్దేశం.

బోర్డు స్కూల్ చదువు కూడా లేని జర్నలిస్టు..
ఈ పత్రికలో పనిచేసే చాలామందికి కనీస చదువు కూడా లేదు. కనీసం బోర్డు స్కూల్ చదువులు కూడా లేవు. ఇక జర్నలిజం అంటే ఏం తెలుస్తుంది? అటువంటి మహిళలు ఓ పత్రిక నడపటం..ఆ దిశగా వారు వేసిన అడుగులు..తెలుసుకున్న విశేషాలు సాధారణమైనవి కావు. ‘‘కనీస చదువులు కూడా లేని వీరికి ఇంగ్లిష్‌ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం‘‘ అంటుంది మీరా అనే జర్నలిస్టు. మీరా ఖబర్‌ లహరియాకు చీఫ్‌ రిపోర్టర్‌. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ డాక్యుమెంటరీ శ్రీకారం చుట్టబడింది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌… ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు ఓ యాగంలా చేపట్టారు. ఈ పత్రిక ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్‌ అంతా మహిళల బాధ్యతే.అందరు దళితులే.

పత్రిక నడపటంతో సవాళ్లు ఎన్నో…అయినా వెనుకడుగు వేయని ధీరలు..
చదువులు రాని మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అనుకుంటే..మరోపక్క దళితులపై అంతులేని వివక్ష మరోవైపు. ఇక వారి అడుగులకు అడుగునా అవాంతరాలే. దళితుల కారణంగా అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోయారు. వీళ్లు వెళ్లిన ప్రతీ చోటా..నీదే కులం అనే ప్రశ్నే మొదలవుతుంది.దీని గురించి మీరా మాట్లాడుతు..నాకు కులం గురించి ప్రశ్న రాగానే..నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం ఏంటీ? అని అడుగుతాను. వారు ఏ కులం పేరు చెబితే నాది కూడా అదే కులం అని చెబుతాను..ఎందుకంటే అక్కడ పని జరగాలికాబట్టి..అని చెబుతుంది మీరా నవ్వుతూ..దళితు ఇన్ని కష్టాలు పడి నడిపే ఈ ‘ఖబర్‌ లహరియా’ ఎంత ఆదరణ పొందిందంటే..చీఫ్‌ రిపోర్టర్‌ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరేంత. జర్నలిజం..వార్తలు..నిజాలు అంటూ ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అని మీరా మీద ఎగిరిపడతాడు. బయట ఎన్నో అవమానాలు..కష్టాలు పడే మీరా భర్త ఆగ్రహానికి నవ్వుకుంటుంది.వాటితో పోలిస్తే నీ కోపం ఏమంత పెద్దదికాదులే అంటుంది.

భర్త కోపానాకి కారణం కూడా లేకపోలేదు…అదేమంటే..ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాస్తుంటుంది. వారు మీరా భర్తమీద విరుచుకుపడతారు..ఆ కోపం కాస్తా భర్త మీరామీద చూపిస్తాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా మీరా మాత్రం ఏమాత్రం భయపడదు..కారణం నా వెనుక నా పత్రికి కాని నా వెనుక పత్రిక ‘ఖబర్‌ లహరియా’ఉందనే ధైర్యం. అందుకే భర్త అరిచినా..‘‘నేనేం తప్పు చేయలేదు..ఉన్నవాటినే ప్రజలకు చెబుతున్నాను అని గట్టిగా వాదించానంటుంది మీరా.ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషులు పాల్పడే హింసలపైనా వార్తలు రాస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు మరెన్నో అవమానాలు..అయినా వారంతా లెక్క చేయటం మానేసినా..వెనుక కుటుంబాలు ఉంటాయికాబట్టికాస్త భయపడతారు. కానీ నిజాన్ని చెప్పాలి కదా అంటారు.

సెల్‌ఫోన్లే కెమెరాలుగా..
పదిహేనేళ్ల పాటు ప్రింట్‌ ఎడిషన్‌ని నడిపిన ఈ దళిన మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారుతుంటారు. ఎందుకంటే విషయాలు జనాలకు చేరవేయాలి కాబట్టి. అందుకే వార్తలను విజువల్‌ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు.దాని కోసం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అవే వారి కెమెరాలు. కానీ వారికి స్మార్ట్ ఫోన్లు ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ నేర్చుకున్నారు.కాలానికి తగినట్లు మారకపోతే ఎక్కడున్నామో అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. అలా ఆగిపోవటం మాకు ఇష్టం లేదంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్‌లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్‌గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్‌ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’కు ఆస్కార్‌ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. దళిత మహిళల సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.