Wrong Chair : పొరపాటు, ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొన్న నెతన్యాహు..వీడియో వైరల్

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా నేషనల్ పార్టీకి చెందిన నాఫ్తాలి బెన్నెట్ ఎన్నికయ్యారు. 12 సంవత్సరాలుగా ప్రధాన మంత్రిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు..పదవీకాలం ఆదివారంతో ముగిసిపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

Wrong Chair : పొరపాటు, ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొన్న నెతన్యాహు..వీడియో వైరల్

Netanyahu Sits In Pm's Chair

Netanyahu Sits In PM’s Chair : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా నేషనల్ పార్టీకి చెందిన నాఫ్తాలి బెన్నెట్ ఎన్నికయ్యారు. 12 సంవత్సరాలుగా ప్రధాన మంత్రిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు..పదవీకాలం ఆదివారంతో ముగిసిపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. దీంతో అతను ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం నేతన్యాహు తనకు కేటాయించిన సీటులో కాకుండా..ప్రధాన మంత్రికి కేటాయించిన సీటులో పొరపాటుగా కూర్చొన్నారు.

ఇది ఇతర సభ్యులు చూశారు. ప్రతిపక్షాలకు కేటాయించిన సీటులో కూర్చొవాలని సూచించారు. ఇది తన సీటు కాదని గ్రహించిన ఆయన..లేచి మళ్లీ తనకు కేటాయించిన సీటులో కూర్చొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. మరిచిపోవడానికి కొంచెం కష్టమైన పనే..మరిచిపోవడానికి టైమ్ పడుద్ది…అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఇజ్రాయెల్ ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్‌ (49) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బెన్నెట్. గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ పార్లమెంటుకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ రాలేదు.

120 మంది సభ్యులుగల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రభుత్వం నిలబడాలి అంటే 61 మంది సభ్యుల బలం అవసరం. కానీ నెతన్యాహు పార్టీకి 30 మంది సభ్యుల బలమే ఉంది. దీంతో ఆయన బల నిరూపణలో ఓడిపోయారు.ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా నేషనల్ పార్టీకి చెందిన నాఫ్తాలి బెన్నెట్ ఎన్నికయ్యారు. 12 సంవత్సరాలుగా ప్రధాన మంత్రిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు..పదవీకాలం ఆదివారంతో ముగిసిపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.