Xiaomi Overtakes Apple : చైనా కంపెనీ దూకుడు.. ఏకంగా యాపిల్‌ను బీట్ చేసిన షావోమి

చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. షావోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయ్. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా చూసుకుంటే శాంసంగ్‌ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన షావోమి నిలిచింది.

Xiaomi Overtakes Apple : చైనా కంపెనీ దూకుడు.. ఏకంగా యాపిల్‌ను బీట్ చేసిన షావోమి

Xiaomi Overtakes Apple

Xiaomi Overtakes Apple : చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. షావోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయ్. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా చూసుకుంటే శాంసంగ్‌ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన షావోమి నిలిచింది. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న యాపిల్‌ స్థానాన్ని షావోమి ఆక్రమించింది. మొత్తంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ గా షావోమి ఘనత సాధించింది. ‘కెనాలసిస్‌’ డేటా ప్రకారం.. మార్కెట్‌ విక్రయాల్లో శాంసంగ్‌ వాటా 19 శాతం కాగా.. షావోమి 17 శాతంతో రెండో స్థానంలో ఉంది. యాపిల్‌కు మార్కెట్‌లో 14 శాతం వాటా ఉన్నట్లు తేలింది.

ఎగుమతులు భారీగా పెరిగిన నేపథ్యంలోనే షావోమి తయారీ గణనీయంగా పుంజుకుంది. షావోమి ఎగుమతులు లాటిన్ అమెరికాకు 300 శాతం, ఆఫ్రికాకు 150 శాతం, పశ్చిమ యూరప్ కు 50 శాతం పెరిగాయి. సొంత దేశానికి చెందిన ఒప్పో, వివో నుంచి షావోమికి గట్టిపోటీ ఎదురవుతున్నట్లు కెనాలసిస్‌ అభిప్రాయపడింది. అయితే, ప్రస్తుతం షావోమి అమ్మకాల్లో నమోదవుతున్న వృద్ధి ఇలాగే కొనసాగితే.. త్వరలో శాంసంగ్‌ను కూడా వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నోట్‌ 10 సహా ఎంఐ సిరీస్‌లోని ఇతర మిడ్‌-ప్రీమియం విభాగంలో వచ్చిన ఫోన్లు షావోమి అమ్మకాల పెరుగుదలకు ఊతమిచ్చాయని తెలిపింది.

గతేడాది హువావేపై అమెరికా ఆంక్షలు విధించడంతో దాని మార్కెట్‌ను ఇతర చైనా సంస్థలు తీసుకోగలిగాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌కు గట్టి పోటీనిస్తూ రెండో స్థానంలో కొనసాగిన హువావే నిష్ర్కమణ షావోమికి బాగా కలిసొచ్చింది. కాగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ లో షావోమి టాప్ 2 పొజిషన్ కు రావడం ఇదే తొలిసారి.