నాచు కాదు మొక్కే : వేల ఏళ్లు బతికే ‘యరేటా’

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 08:28 AM IST
నాచు కాదు మొక్కే :  వేల ఏళ్లు బతికే ‘యరేటా’

ఈ విశ్వంలో చిత్ర విచిత్రాలు ఎన్నో..ఎన్నెన్నో..ప్రకృతిలో మొక్కలకు ప్రత్యేక స్థానముంది. లక్షల కోట్ల రకాల మొక్కల్లో ఎన్నో వింతలు దాగున్నాయి. వందల సంవత్సరాల పాటు బతికే చెట్లు గురించి విన్నాం. ఈ క్రమంలో ఓ మొక్క వేల సంవత్సరాలు బ్రతుకే ఉంది.  దాని పేరు ‘యరేటా’

ఎన్నో మొక్కలు చూసుంటాం..ఇంకెన్నో మొక్కల గురించి తెలుసుకుని ఉంటాం. కానీ సంవత్సరానికి ఒకటిన్నర సెం.మీ మాత్రమే పెరిగే ‘యరేటా’ మొక్క మూడు వేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉంది. ఒక మొక్క అంత కాలం నుంచి బ్రతికే ఉంది అంటే నమ్మకం కలగటంలేదు కదూ..పర్యవారణ వేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆండీస్ పర్వతాలపై విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ..అతి నెమ్మదిగా పెరుగుతోంది.దాన్ని చూస్తే రాతి మీద పరుచుకున్న పచ్చటి గడ్డి అనుకుంటాం. కానీ అది ఒక మొక్క జాతికి చెందినదేనని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
‘యరేటా’ మొక్క స్పెషల్ 

  • ‘యరేటా’ ఏడాదికి ఒకటిన్నర సెం.మీ మాత్రమే పెరుగుతుంది. 
  • ఒక పెద్దరాయి సైజులో యరేటా మొక్క ఉందంటే అది కొన్ని వేల సంవత్సరాల నాటిదని అర్థం చేసుకోవాలంటారు నిపుణులు..
  • అపియేసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క పెరూలోని ఆండీస్‌, బొలీవియా, చిలీ, అర్జెంటీనా దేశాల్లో మాత్రమే ఈ ‘యరేటా’ మొక్క కనిపిస్తుంది. 
  • సముద్రమట్టానికి 3200 నుంచి 4500 అడుగుల ఎత్తులో పర్వతాలపై మాత్రమే పెరుగుతుంది. 
  • వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం యరాటాలోని మరో  ప్రత్యేకత. 
  • భూమి నుంచి వేడిని గ్రహించుకోవడం కోసం ఎక్కువ ఎత్తు పెరగకుండా నేలబారునే ‘యరేటా’ పెరుగుతుంది. 
  • వేడి ఆవిర్లు వచ్చే కాలంలో కూడా తేమను కోల్పోకుండా ఉండటం కోసం మైనం లాంటి పూతను కలిగిన ఆకులు దీనికి సహకరిస్తాయి. 
  • యరేటా మొక్క ఎండిన తరువాత మండే స్వభావం కలిగి ఉంటుందట. ప్రస్తుతం ఈ మొక్క అంతరించిపోకుండా పరిరక్షిస్తున్నారు.