Rajacenna drawing : ఒకేసారి రెండు చేతులు, రెండు కాళ్లతో పెయింటింగ్ వేస్తున్న యువతి..చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే

ఒకేసారి రెండు చేతులు, రెండు కాళ్లతో పెయింటింగ్ వేస్తోంది ఓ యువతి..చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే అనిపించకమానదు ..అదికూడా అచ్చు గుద్దినట్లుగా ఆరు పెయింటింగ్ లు ఒకేసారి వేసేస్తోంది.

Rajacenna drawing : ఒకేసారి రెండు చేతులు, రెండు కాళ్లతో పెయింటింగ్ వేస్తున్న యువతి..చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే

Rajacenna drawing

Rajacenna drawing: మనం పెయింటింగ్‌ ఎలా వేస్తాం..? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకోకండి..? మామూలుగా అయితే కొందరు చేయితో వేస్తారు.. మరికొంతమంది కాళ్లతో కూడా వేసేస్తారు. కాని రజసెన్నా అనే యువతి పెయింటింగ్ వేస్తుందంటే కన్నార్పకుండా చూడాల్సిందే.. మన కళ్లు కూడా కదలనంత స్పీడ్ గా ఒకేసారి తన రెండు చేతులను..రెండు కాళ్లను ఉపయోగించి పెయింటింగ్ లు వేసేస్తోంది. రెండు చేతులు రెండు కాళ్లతో ఒకేసారి వేసినా నాలుగు పెయింటింగులు మాత్రమే వేయగలుగుతారు. కానీ రజసెన్నా స్టైలే వేరు..ఆమె స్పీడే వేరు ఒకేసారి ఆరు పెయింటింగ్ లు వేసే చూసేవారి దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది.వింటేనే ఔరా అనిపిస్తోంది కదూ.. మరి చూస్తే ఇంకెలా అనిపిస్తుందో కదా.. రెండు చేతులూ, రెండు కాళ్లతో ఒకేసారి పెయింటింగ్ వేసేస్తోంది.. అది కూడా ఒకేసారి ఆరుగురి ఫోటోలు అచ్చుగుద్దినట్లు పేపర్‌ మీద దింపేస్తోంది..

ఓ టేబుల్‌ పైన రెండు చేతులతో నాలుగు.. టేబుల్‌ కింద రెండు కాళ్లతో రెండు పెయింటింగ్స్‌కు ఒకేసారి అవలీలగా వేసేస్తోన్న ఈ అమ్మాయి పేరు రజసెన్నా.. 1994 జనవరి 24న నెదర్లాండ్‌లో పుట్టిన ఈమె.. చిన్నప్పటి నుంచే పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టింది. రజసెన్నా పెయింటింగ్ వేసేటప్పుడు ఆమె మెదడు అసాధారణ రీతిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు వైద్యులు.. ఈమె పెయింటింగ్ పూర్తి కావడానికి 40 గంటల సమయం పట్టొచ్చు. చేతులతో కంటే కాళ్లతో పెయింటింగ్ వేయడమే తనకు మంచి అనుభూతినిచ్చిందని చెబుతోంది రజసెన్నా..