కరోనా సోకి పోయిన తర్వాత మళ్లీ వచ్చింది.. ప్రపంచంలో ఫస్ట్ కేసు ఇదే!

  • Published By: vamsi ,Published On : August 25, 2020 / 07:16 AM IST
కరోనా సోకి పోయిన తర్వాత మళ్లీ వచ్చింది.. ప్రపంచంలో ఫస్ట్ కేసు ఇదే!

కోవిడ్ -19 సోకి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తిరిగి వ్యాధికి గురైన ఘటన హాంకాంగ్‌లో చోటుచేసుకుంది. అక్కడి వైద్యులు ప్రకారం.. ఓ రోగిని రెండుసార్లు కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకుని మళ్లీ కరోనా సోకిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే ఆ వ్యక్తి మొదటి వారు.



ప్రాణాంతక కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న నాలుగు నెలల తర్వాత 33 ఏళ్ల ఆ వ్యక్తి మళ్లీ కరోనావైరస్ పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. జన్యు విశ్లేషణ అతని రెండవ సంక్రమణను గురించి వెల్లడించింది. కొరోనావైరస్‌కు ప్రజలు రెండుసార్లు గురయ్యారని చూపించే అనేక నివేదికలు ఇటీవలి కాలంలో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఆశలుపై నీళ్లు చల్లుతుంది.

కానీ ఇప్పటి వరకు, శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం తిరిగి కరోనా కేసులు రావడంలో పరీక్షల లోపం ఎక్కువగా కనిపించివంది. వైరస్ క్రియారహిత కణాలు కరోనాను ఓడించిన కొన్ని నెలల తర్వాత కూడా రోగుల శరీరంలో ఇప్పటికీ ఉండడం కాస్త ఆందోళన కలిగించే విషయం.



చికెన్‌పాక్స్ వంటి కొన్ని అనారోగ్యాలలో, శరీరం ఆ వైరస్‌ను ఎలా నాశనం చేయాలో ఖచ్చితంగా గుర్తుంచుకోగలదు. శరీరంలోకి తిరిగి వస్తే లక్షణాలు మొదలయ్యే ముందు దాన్ని తప్పించుకోగలుగుతారు. అయితే కరోనా విషయంలో అటువంటి పరిస్థితి ఉందా? అనేది అప్పుడే బయటపడట్లేదు. ఈ శీతాకాలంలో దేశాల్లో రెండవ తరంగ కరోనా వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కరోనావైరస్ రెండవసారి తిరిగి సంక్రమించినట్లు రుజువు చేసిన మొదటి వారు హాంకాంగ్ విశ్వవిద్యాలయంలోని లి కా షింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.