Ruth Lujan : ఆమె నడుము 11.8 అంగుళాలు.. అందరూ రోబో అని పిలుస్తున్నారట..

ఆడవారు నడుము సన్నగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. అయితే మరీ 11.8 అంగుళాల నడుము ఉంటే. అమ్మో.. నిజంగానే ఓ యువతి నడుము సైజు అది. అయితే ఆమె నడుము అంత సన్నగా ఉండటానికి కారణం ఉంది.

Ruth Lujan : ఆమె నడుము 11.8 అంగుళాలు.. అందరూ రోబో అని పిలుస్తున్నారట..

Ruth Lujan

viral videos : ఆడవారు నడుము సన్నగా, నాజుగ్గా ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. మరీ 11.8 అంగుళాల నడుము సైజు అయితే కోరుకోరు. ఓ యువతి నడుము సైజు అది. నమ్మరు కదా.. నిజమే మెక్సికన్ బ్యాలెట్ డ్యాన్సర్ రూత్ లుజన్ అంత చిన్న నడుముతో విచిత్రంగా కనిపిస్తోంది.

Bengaluru : డేటిండ్ యాప్ ఆమె కొంప ముంచింది.. రూ.4.5 లక్షలు మోసగాడు స్వాహా..

మెక్సికన్ బ్యాలెట్ డ్యాన్సర్, స్టంట్ ఆర్టిస్ట్ రూత్ లుజన్ 24 సంవత్సరాలు..19 సంవత్సరాల వయసులో డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన డ్యాన్సింగ్ మూమెంట్స్ లో తేడా కనిపెట్టింది. డాక్టర్‌ని సంప్రదించడంతో హైపర్‌లాగ్జిటీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు చెప్పాడు. దీని వల్ల ఆమె మజిల్స్, లిగమెంట్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం డాక్టర్ నడుముకి కార్ సెట్స్ వాడమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి రూత్ కార్సెట్స్ వాడటం మొదలుపెట్టింది.

Dubai : ఒకరోజు షాపింగ్‌కి రూ.70 లక్షలు .. భర్త డబ్బు ఖర్చుచేయడం ఆమె హాబీనట

కార్సెట్స్ వాడకముందు రూత్ నడుము 15 అంగుళాలు ఉండేది. ఇప్పుడు 11.8 అంగుళాలకు తగ్గిపోయింది. తనను చూసి చాలామంది రోబో అనుకుంటారని రూత్ అంటుంది. తన రూపం ఇలా అనిపించినా తనకు గర్వంగా అనిపిస్తుందని చెబుతుంది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాని చెబుతున్నరూత్  రీసెంట్‌గా ఓ షోలో కూడా పాల్గొంది. కార్సెట్స్‌ను ఎలా కట్టుకుంటుందో  షోలో చూపించింది. ఎవరు ఎన్ని విమర్శలు గుప్పించినా తన రూపంపై కామెట్లు చేసినా రూత్ పట్టించుకోదట. తనకున్న సమస్యను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోంది రూత్ లుజన్.

 

View this post on Instagram

 

A post shared by Ruth Lujan (@abracadabra.patadecabra)