కరోనా తెలియని కుర్రోడు

కరోనా తెలియని కుర్రోడు

Young Man Accidentally Falls Asleep : కరోనా తెలియదా ? ప్రపంచాన్ని అతలాకుతలం చేసి..ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ గురించి అతనికి తెలియదు. కరోనా వైరస్ ఎప్పుడొచ్చింది ? అనంతరం జరిగిన పరిణామాలు అతనికి ఎవరూ చెప్పలేదు. అయినా..ఆ విషయాలు అతనికి ఏమీ తెలియదు. ఎందుకంటే..అతను కోమాలో ఉండడమే. ఒక నెల కాదు..రెండు నెలలు కాదు..ఏకంగా 11 నెలలు కోమాలో ఉండడం వల్ల..కోవిడ్ సంగతులు ఏవీ తెలియదు. రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో వార్తల్లోకెక్కాడు. అతనే..జోసెఫ్ ఫ్లావిల్.

యూకేకి చెందిన 19 ఏళ్ల జోసెఫ్…కరోనా అంతగా వ్యాప్తి చెందకముందు..మార్చి 01వ తేదీన రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా..ఇతడిని ఓ కారు గుద్దేసింది. దీంతో తలకు దెబ్బ తలగడంతో పాటు..మెదడుకు తీవ్రగాయమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాక..అంటే 11 నెలల పాటు కోమాలోనే ఉండిపోయాడు. అనంతరం ప్రపంచాన్ని మొత్తం..కరోనా వైరస్ చుట్టేసింది. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. యూకేలో ఎంతో మందిని ఈ వైరస్ బలిగొంది. ఇప్పటికి రెండుసార్లు ఈ వైరస్ విస్తరించింది. వైరస్ వ్యాక్సిన్ కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కోమాలో నుంచి బయటకు వచ్చిన జోసెఫ్ కు ఈ విషయాలు చెబితే..ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదని అంటున్నారు కుటుంబసభ్యులు. కోలుకున్నాక..మెల్లిమెల్లిగా..అన్నీ అర్థమయ్యేలా చెబుతామంటున్నారు వారు.