ప్రియురాలితో బిడ్డకు జన్మనిచ్చి, అత్తతో లేచిపోయిన అల్లుడు

ప్రియురాలితో బిడ్డకు జన్మనిచ్చి, అత్తతో లేచిపోయిన అల్లుడు

Young man elopes with lover mother in london : కొన్ని కొన్ని వార్తలు వింటుంటే భలే విచిత్రంగా ఉంటుంది. మనుషులు ప్రవర్తన వావి వరసలు మర్చిపోయి చేసే సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. విదేశాల్లో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రియురాలితో ప్రేమ కలాపాలు సాగించి ఆమెను గర్భవతిని చేసి, బిడ్డకు జన్మనిచ్చినతర్వాత ఆమె తల్లితో లేచిపోయాడో ప్రియుడు.

ఇంగ్లాండ్ లోని గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్‌ అల్‌డ్రిడ్జ్‌ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్‌ షెల్టన్‌ (29) అనే యువతితో కొన్నాళ్లుగా లవ్ ఎఫైర్ నడిపాడు. ఆమెతో సన్నిహితంగా గడపటంతో ఆమె గర్భం దాల్చింది. అదే సమయంలో రియాన్ తల్లి జార్జినాతోకూడా అల్ డ్రిడ్జ్ ప్రేమాయణం నడిపాడు. రాత్రిళ్లు ఇద్దరూ కిచెన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బకార్డి తాగేవారు.

వీరి ప్రవర్తపై అనుమానం వచ్చిన రియాన్ ఒకరోజు వీరిద్దరినీ నిలదీసింది. అబ్బే అదేం లేదని బుకాయించారు.రియాన్ కు తెలియకుండా అల్ డ్రిడ్జ్, జార్జినా కలుసుకోవటం మొదలెట్టారు. కొన్నాళ్లకు ఈవిషయం రియాన్ కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ఆమె కడుపుతో ఉండి ఇంట్లోనే ఉండటంతో వీరిద్దరూ బయట కలుసుకునే వాళ్లు ఇలా ఉండగా జనవరి 28న జెస్‌ అల్‌డ్రిడ్జ్‌, రియాన్ ల ప్రేమకు గుర్తుగా పండంటి బాబు పుట్టాడు.

రియాన్ కు ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు కారణం తన బిడ్డకు తండ్రి అయిన జెస్‌ అల్‌డ్రిడ్జ్, తనకు బ్రేక్ అప్ చెప్పి తన తల్లి జార్జినాతో లేచిపోయాడు అని తెలుసుకుని షాక్ కు గురయ్యింది. జెస్ అల్‌డ్రిడ్జ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇకనుంచి ఇద్దరం విడిపోదాం. అని అందులో సారాంశం. కష్టాన్ని దిగమింగుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది. నాకు నా బిడ్డకు తోడుగా ఉంటుందనుకున్న తల్లి ఇలా నా ప్రియుడితో పారిపోతుందనుకోలేదని బాధ పడింది.