Young Woman Died In Police Custody : హిజాబ్‌ ధరించలేదని యువతి అరెస్ట్‌.. పోలీసు కస్టడీలో అనుమానాస్పద మృతి

ఇరాన్‌ లో హిజాబ్‌ ధరించలేదని అరెస్టు చేసిన యువతి పోలీస్‌ కస్టడీలో మృతి చెందారు. హిజాబ్‌ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్‌ చేశారు. అయితే పోలీస్‌ కస్టడీలో ఉన్న సదరు మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Young Woman Died In Police Custody : హిజాబ్‌ ధరించలేదని యువతి అరెస్ట్‌.. పోలీసు కస్టడీలో అనుమానాస్పద మృతి

young woman died in police custody

Young Woman Died In Police Custody : ఇరాన్‌ లో హిజాబ్‌ ధరించలేదని అరెస్టు చేసిన యువతి పోలీస్‌ కస్టడీలో మృతి చెందారు. హిజాబ్‌ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్‌ చేశారు. అయితే పోలీస్‌ కస్టడీలో ఉన్న సదరు మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

22 ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్‌ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్‌ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. అయితే నైతిక పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

lockup Death : మరో లాకప్ డెత్ ఘటన-10 రోజుల్లో రెండో కేసు

ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్‌ కోడ్‌ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందమంది నిరసనకు దిగారు.

ఆ యువతి మరణానికి కారణమైన పోలీసులను చట్టం ప్రకారం శిక్షించాలని నినాదాలు చేస్తూ, డిమాండ్ చేశారు. మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మరణానికి కారణమైన వారిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.