ప్రపంచంలో స్ట్రీమింగ్ సర్వీసులకు ఇండియాలోనే తక్కువ చెల్లిస్తున్నారు!

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 03:49 PM IST
ప్రపంచంలో స్ట్రీమింగ్ సర్వీసులకు ఇండియాలోనే తక్కువ చెల్లిస్తున్నారు!

అసలే కరోనా కాలం.. బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మల్టీఫ్లెక్స్ లకు వెళ్లి సిల్వర్ స్ర్కిన్‌పై సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం అందరూ స్ట్రీమింగ్ OTT ప్లాట్ ఫాంలపైనే ఆధారపడుతున్నారు. ప్రధానంగా పాపురల్ ఓటీటీ దిగ్గజాల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను వినియోగించేవారే ఎక్కువ. దీంతో స్ట్రీమింగ్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. స్ట్రీమింగ్ సర్వీసులు సైతం వినియోగదారుల కోసం కొత్త అప్ డేట్స్ అందిస్తున్నాయి. పాపులర్ స్ట్రీమింగ్ షోలను బింగ్ చేస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎంటర్‌టైన్మెంట్ ద్వారా ఆందోళనలను మర్చిపోతున్నారు. స్ట్రీమింగ్ సర్వీసులకు భారతీయులు ప్రపంచంలోని ఇతర దేశాల యూజర్ల కంటే అతి తక్కువ రేట్లు చెల్లిస్తున్నారని ఓ నివేదిక తెలిపింది.

సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ VPNPro విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకాం… ఆన్‌లైన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌ల సబ్ స్ర్కిప్షన్ పొందే చౌకైన దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలతో షేర్ చేసుకోవడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, స్పాటిఫై, ఎక్స్‌బాక్స్ గేమ్స్ వంటి ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్ ఫాంలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశంలోనే చాలా తక్కువ రేట్లు ఉన్నాయని తెలిపింది. నెలవారీ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్ర్కిప్షన్ భారతదేశంలో రూ .129 (1.71 డాలర్లు), అదే యుఎస్‌లో దాదాపు రూ.1,000 ($ 12.99) వరకు ఉంది. భారతదేశంలో స్ట్రీమింగ్ సర్వీసును ప్రపంచంలో ఆరవ చౌకైన ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది.

స్విట్జర్లాండ్‌లో కంటే భారతదేశంలో దాదాపు 90 శాతం తక్కువగా ఉంది. స్టాండర్డ్ డెఫినిషన్ (SD) సింగిల్ స్క్రీన్ ప్లాన్‌కు రూ. 499 చెల్లిస్తుండగా.. స్విట్జర్లాండ్‌లో ఇదే ధర రూ .933 ($ 12.48)గా ఉంది. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ – మొబైల్ ఓన్లీ స్ట్రీమింగ్‌ను అందించే ప్రత్యేకమైన సబ్ స్ర్కిప్షన్ ఆఫర్ కూడా. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి తక్కువగా అందించడం లేదు. దీనికి రూ. 199 (2.88 డాలర్లు) ఖర్చవుతుంది.

స్పాటిఫై వంటి మ్యూజిక్ సర్వీసులకుభారతదేశంలో రూ .120 ($1.59) ఖర్చవుతుంది. కానీ, డెన్మార్క్‌లో రూ .1,134 ($ 15.01) ఖర్చవుతుంది. ఇది దాదాపు 10 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. ఆపిల్ మ్యూజిక్ భారతదేశం కంటే డెన్మార్క్‌లో 1,045 శాతం ఎక్కువ ఖరీదైనది. స్పాటిఫై 850 శాతం ఎక్కువ ఖరీదైనది. భారతదేశంలో గేమ్స్ కూడా చౌకైనవిగా ఉన్నాయి. భారతదేశంలో ఒక ఎక్స్‌బాక్స్ గేమ్ ఆడేందుకు రూ .2,048 ఖర్చవుతుంది. అత్యంత ఖరీదైన దేశం సౌదీ అరేబియాలో (రూ .3,973) వరకు ఖర్చవుతుంది. ఒకే సర్వీసుకు వేర్వేరు ధరలను అందిస్తోంది. సంపన్న, తక్కువ సంపన్న దేశాల మధ్య ధరలో చాలా ఎక్కువ వ్యత్యాసం ఉందని నివేదిక వెల్లడించింది.

ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో స్ట్రీమింగ్ సర్వీసు రేట్లు తక్కువే. ఈ సర్వీసులు భారతదేశంలో తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. భారతదేశంలో ఎక్స్‌బాక్స్ గేమ్స్ చౌకగానే అందుబాటులో ఉన్నాయి. ఖర్చులను జిడిపిలో ఒక శాతంగా చూస్తే.. సింగపూర్ కంటే భారతదేశంలో 11 రెట్లు ఎక్కువ ఖరీదైనవి. మార్చిలో నిర్వహించిన ప్రీ-పాండమిక్ సర్వేలో 80 శాతం మంది ప్రజలు టీవీ ఛానెళ్లను తగ్గించుకుని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు మారినట్టు తేలింది.

Read:శక్తివంతమైన బ్యాటరీతో.. రూ .8వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు