Ukraine President: ఉక్రెయిన్ రా.. నీకే తెలుస్తుంది.. ఎలాన్ మస్క్‌పై జెలెన్‌స్కీ ఆగ్రహం..

ఉక్రెయిన్ అధ్యక్షుడికి కోపమొచ్చింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ కూర్చోని మాట్లాడొద్దు.. ఉక్రెయిన్ వచ్చి చూసి మాట్లాడు మస్క్ అంటూ సూచించాడు. ఇంతకీ జెలెన్ స్కీకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. వివరాల్లోకి వెళితే..

Ukraine President: ఉక్రెయిన్ రా.. నీకే తెలుస్తుంది.. ఎలాన్ మస్క్‌పై జెలెన్‌స్కీ ఆగ్రహం..

Ukraine President: ఉక్రెయిన్ అధ్యక్షుడికి కోపమొచ్చింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ కూర్చోని మాట్లాడొద్దు.. ఉక్రెయిన్ వచ్చి చూసి మాట్లాడు మస్క్ అంటూ సూచించాడు. ఇంతకీ జెలెన్ స్కీకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్ ఖేర్సన్, జపోరిజియా, లుహన్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్ ఇటీవల ప్రకటించారు. దీన్ని ఐరాస తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మస్క్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీటే జెలెన్ స్కీ ఆగ్రహానికి కారణమైంది.

Ukraine vs Russia: ఉక్రెయిన్‭కు శాపంగా మారిన యుద్ధం.. 15,000 మందికి పైగా మిస్సింగ్

మస్క్ తన అక్టోబర్ నెలలో ఓ ట్వీట్‌లో.. రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్ కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాలన్ని వీడాలి అని అన్నారు. అంతేకాదు.. 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. ఉక్రెయిన్ తటస్థంగా ఉడాలి అంటూ మస్క్ అన్నాడు. అంతటితో ఆగకుండా తన ప్రణాళికలపై ట్విటర్ లో ఓటింగ్ సైతం పెట్టాడు. మస్క్ తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు ఉక్రెయిన్ అధికారులు మండిపడ్డారు. మస్క్ ట్వీట్ కు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతిచ్చే మస్క్ ఇష్టమా?.. రష్యాకు మద్దతు ఇచ్చే మస్క్ ఇష్టమా? అంటూ జెలెన్ స్కీ ట్విటర్ లో ఓటింగ్ పెట్టాడు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Ukraine X Russia: ఉక్రెయిన్‭తో యుద్ధంలో పుతిన్ గెలవలేరు: జర్మన్ ఛాన్స్‭లర్

తాజాగా.. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు మరోసారి ప్రస్తావించాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో.. అక్టోబర్ నెలలో మస్క్ ట్వీట్ ను గుర్తు చేస్తూ.. మస్క్ ఉక్రెయిన్ వచ్చి అలా మాట్లాడాలని అన్నారు. ఆయనపై ఎవరి ప్రభావమైనా ఉండొచ్చు.. రష్యా ఇక్కడ ఏం చేస్తుందో అతనికి అర్థం కావాలంటే స్వయంగా ఉక్రెయిన్ వచ్చి ఇక్కడి పరిస్థితులను చూడాలి.. అప్పుడు మాట్లాడితే బాగుంటుంది అని జెలెన్ స్కీ అన్నారు.