Biden: అమెరికా హెచ్చరించినా జెలెన్‌స్కీ వినలేదట..

యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. నాలుగు నెలలుగా ఆ దేశంపై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. యుక్రెయిన్ లోని ఒక్కో ప్రాంతాన్ని రష్యా తమ ఆదీనంలోకి తెచ్చుకుంటుంది. రష్యా సైన్యం దురాక్రమణతో యుక్రెయిన్ లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. యుక్రెయిన్ కు అమెరికాతో పాటు పలు దేశాలు అండగా ఉంటూ ఆయుధ సామాగ్రిని అందిస్తున్నాయి

Biden: అమెరికా హెచ్చరించినా జెలెన్‌స్కీ వినలేదట..

China-Taiwan conflict

Biden: యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. నాలుగు నెలలుగా ఆ దేశంపై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. యుక్రెయిన్ లోని ఒక్కో ప్రాంతాన్ని రష్యా తమ ఆదీనంలోకి తెచ్చుకుంటుంది. రష్యా సైన్యం దురాక్రమణతో యుక్రెయిన్ లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. యుక్రెయిన్ కు అమెరికాతో పాటు పలు దేశాలు అండగా ఉంటూ ఆయుధ సామాగ్రిని అందిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి యుక్రెయిన్ కు అమెరికా అండగా ఉంటూ రష్యాపై యుద్ధం విరమణకు ఒత్తిడి తెస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెన్, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Russia: ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌లో బ్యాంకులు ప్రారంభిస్తోన్న ర‌ష్యా

రష్యా చేస్తోన్న దురాక్రమణ యుక్రెయిన్ కు తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను తెచ్చిపెడుతోందని చెప్పామని, కానీ అమెరికా ముందస్తు హెచ్చరికలను జెలెన్ స్కీ వినడానికి ఇష్టపడలేదని బైడెన్ అన్నారు. లాస్ ఏంజెల్స్ లో నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల నాటి పరిణామాలను బైడెన్ వివరించారు. రష్యా దాడి గురించి నేను ముందస్తుగా చేసిన హెచ్చరికలు చాలా మంది పట్టించుకోలేదన్నారు. పుతిన్ సేన సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, అదే విషయాన్ని జెలెన్ స్కీ కి తెలిపినప్పటికీ ఈ విషయాన్ని వినేందుకు ఇష్టపడలేదని బైడెన్ అన్నాడు. తాము అంచనా వేసినట్లుగానే పుతిన్ సేన దురాక్రమణలకు దిగాయని బైడెన్ అన్నారు.