Covid In China : జీరో కొవిడ్ విధానంపై భగ్గుమంటున్న చైనా .. విద్యాసంస్థలకు వ్యాపించిన ఆందోళనలు
చైనాలో జీరో కోవిడ్ విధానంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వీధుల్లోకి వేలాదిమందిగా వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను ప్రభుత్వం నిరంకుశత్వంగా అణిచివేస్తోంది. అయినా ఆందోళనలు ఎక్కడా ఆగటంలేదు. కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆందోళనలు విద్యాసంస్థకు కూడా వ్యాపించాయి. విద్యార్ధులు కూడా కోవిడ్ ఆంక్షల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు.

Zero covid policy In China : చైనాలో జీరో కోవిడ్ విధానంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వీధుల్లోకి వేలాదిమందిగా వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను ప్రభుత్వం నిరంకుశత్వంగా అణిచివేస్తోంది. అయినా ఆందోళనలు ఎక్కడా ఆగటంలేదు. కొనసాగుతునే ఉన్నాయి. ఈ ఆంక్షలు భరించలేమని జిన్ పింగ్ మరోసారి అధ్యక్షుడై మా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం జీరో కోవిడ్ విధానం. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆందోళనలు విద్యాసంస్థకు కూడా వ్యాపించాయి. విద్యార్ధులు కూడా కోవిడ్ ఆంక్షల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు.
చైనాలో జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు యూనివర్శిటీ క్యాంపస్‌ల్లో కూడా మొదలయ్యాయి. ఇటువంటి ఆందోళనలకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ గత 10ఏళ్లలో ఎప్పుడూ చవిచూడలేదు. దాదాపు 50కిపైగా విద్యాలయాల్లో విద్యార్దులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉరుమ్‌ఖీలో అగ్ని ప్రమాదం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.మరోవైపు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో చైనా అధికారులు కఠిన లాక్డౌన్లను విధిస్తున్నారు. ఆదివారం (నవంబర్ 27,2022)ఒక్క రోజే చైనాలో 39,500 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మొదలైన నాటి నుంచి చైనాలో ఒక్కరోజు అత్యధిక కేసులు నమోదు కావటం.
షాంఘైలో ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ నగరంలో ఆందోళనలు చేస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు చైనాలో కీలక నగరాల్లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చైనా అధికారిక మీడియా మౌనం వహిస్తోంది. మరో వైపు ఈ ఆందోళనలను కవర్ చేస్తున్న పశ్చిమదేశాల మీడియాపై గ్లోబల్ టైమ్స్ వ్యతిరేక కథనం ప్రచురించింది.
చైనాలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా పారిస్, అమ్‌స్టర్‌డామ్, డబ్లిన్, టొరెంటో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ప్రదర్శనలు జరిగాయి. చైనాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కవర్ చేస్తున్న ఓ విదేశీ జర్నలిస్టును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడిపై దాడి కూడా చేసినట్లు వీడియోలు వెలువడుతున్నాయి. అతడి చేతులకు బేడీలు వేసి తరలించారు. ఇలా కోవిడ్ పుట్టినిల్లు అయిన భావిస్తున్న చైనాలో కోవిడ్ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. మరోపక్క ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆందోళనలు..ఆగ్రహాలు ఏస్థాయికి వెళ్లాయంటే జిన్ పింగ్ అధ్యక్షపదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసేందగా ఉన్నాయి.