Zimbabwe: భూమిలోకి కుంగిపోయిన క్లాస్ రూమ్.. 17 మందికి విద్యార్థులకు గాయాలు

జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్‌లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాలా మంది విద్యార్థులు గోతిలో పడిపోయారు.

Zimbabwe: జింబాబ్వేలో దారుణం జరిగింది. ఒక పాఠశాలలోని క్లాస్ రూమ్ ఉన్నట్లుండి భూమిలోకి కుంగిపోయింది. దీంతో క్లాసులో ఉన్న వారిలో 17 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే

క్లాసు రూమ్‌లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాలా మంది విద్యార్థులు గోతిలో పడిపోయారు. బెంచీలు కూడా గోతిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో 17 మంది చిన్నారులు గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. స్కూల్ ఉన్న ప్రాంతంలో అక్రమ గోల్డ్ మైనింగ్ జరుగుతోంది. భూమిలోపల బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. స్కూల్ చుట్టుపక్కల పేలుళ్లు జరుపుతున్నారు.

AAP Vs BJP: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపణ

ఈ కారణంగానే స్కూల్ పరిధిలోని భూమి కుంగిపోయిందని స్థానిక ఎంపీ జుడిత్ తొబైవా తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఆమె తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్కూలును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ప్రత్యామ్నాయ స్కూల్ కోసం వెతుకుతున్నామన్నారు. ఇక్కడి మైనింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు