అంతర్రాష్ట్ర బస్సులు పునఃప్రారంభానికి రెడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా ప్రభావంతో ఆగిపోయిన అంతర్రాష్ట్ర బస్సులు తిరిగి ప్రారంభించనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో కేవలం 25 శాతం మాత్రమే సిటీ బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్‌ పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఆర్టీసీ బస్సుల వ్యవహారాలపై సీఎం కేసీఆర్‌ గురువారం మంత్రి పువ్వాడతో సమీక్షించారు.

‘నగర శివార్ల నుంచి ఇతర ప్రాంతాలకు బుధవారం 150 బస్సులను ప్రారంభించాం. శుక్రవారం నుంచి సుమారు 600 నుంచి 700 బస్సుల వరకు నడపాలని నిర్ణయించాం. గ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాం. ఆయా బస్సుల్లో రద్దీ పెరిగిన పక్షంలో మరిన్ని బస్సులను పెంచే విషయాన్ని పరిశీలిస్తాం.బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశాం. ఏపీ ఆర్టీసీతో అంతర్‌ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం ఇంకా కుదరకపోవటంతో రాష్ట్రానికి బస్సులు నడపటం లేదు’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు.

Related Posts