లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

ఐపీఎల్ – 13 : పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం

Published

on

rajasthan royals

Rajasthan Royals win : ఐపీఎల్ – 13వ సీజన్ లో పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ పై రాజస్థాన్ గెలుపొందింది. పంజాబ్ 4 వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. రాజస్థాన్ 3 వికెట్లు నష్టపోయి 186 పురుగులు చేసింది.బెన్‌స్టోక్స్‌26 బంతుల్లో 50 పరుగులు (6ఫోర్లు, 3సిక్సర్లతో), సంజు శాంసన్‌ 25 బంతుల్లో 48 పరుగులు (4ఫోర్లు, 3సిక్సర్లతో) రెచ్చిపోవడంతో రాజస్థాన్‌ అలవోకగా విజయం సాధించింది. రాబిన్‌ ఉతప్ప(30), స్టీవ్‌ స్మిత్‌(31 నాటౌట్‌), జోస్‌ బట్లర్‌(22 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగి విజయంలో కీలకపాత్ర పోషించారు.పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ మినహా ఏ బౌలర్‌ రాజస్థాన్‌ జోరును అడ్డుకోలేకపోయారు. అందరు బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మురుగన్‌ అశ్విన్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ తీశారు.అంతకుముందు క్రిస్‌గేల్‌ 63 బంతుల్లో 99 పరుగులు (6ఫోర్లు, 8సిక్సర్లతో) చెలరేగడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 41 బంతుల్లో 46 పరుగులు (3ఫోర్లు, 2సిక్సర్లతో) రాణించారు.నికోలస్‌ పూరన్‌ 10 బంతుల్లో 22 పరుగులు (3సిక్సర్లతో) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.