IPL 2020, DC vs CSK Live: ఉత్కంఠ పోరులో చెన్నైపై ఢిల్లీ విజయం..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp
Picture

చెన్నైపై ఢిల్లీదే మ్యాచ్

17/10/2020,11:22PM

చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 180పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.5ఓవర్లలో 185పరుగులు చేసి చెన్నైపై 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా అక్సర్‌ పటేల్‌(21) మూడు సిక్సర్లు కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ధావన్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా చివరి ఓవర్‌‌లో 22 పరుగులిచ్చాడు.

Picture

గబ్బర్ సెంచరీ.. ఢిల్లీ స్కోరు 163/5

17/10/2020,11:13PM

57బంతుల్లో 100పరుగులు పూర్తి చేసుకున్నాడు గబ్బర్.. శామ్ కర్రన్ బౌలింగ్‌లో 19వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తియ్యడం ద్వారా ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివరి ఓవర్‌లో ఢిల్లీకి గెలవాలంటే 17పరుగులు చెయ్యాల్సన పరిస్థితి వచ్చింది.

Picture

5వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. 159/5

17/10/2020,11:06PM

ఢిల్లీ జట్టు 5వ వికెట్ కోల్పోయింది. 7బంతుల్లో 4పరుగులు చేసి అలెక్స్ క్యారీ అవుట్ అయ్యాడు. ఇక 11బంతుల్లో 21పరుగులు ఢిల్లీకి అవసరం.

Picture

స్టాయినిస్ అవుట్.. ఢిల్లీ స్కోరు 139/4

17/10/2020,11:01PM

శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. రాయుడు చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Picture

శ్రీయాస్ అవుట్.. ఢిల్లీ స్కోరు 94/3

17/10/2020,10:32PM

చెన్నైపై చేజింగ్‌లో ఢిల్లీ చెలరేగి ఆడుతుండగా.. ధావన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ధావన్‌కు తోడుగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్న శ్రీయాస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. డ్వైన్ బ్రావో బౌలింగ్‌లో ఫాఫ్ డూప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ప్రస్తుతం క్రాజులో స్టాయినిస్ ఉండగా.. మరోవైపు గబ్బర్ 35బంతుల్లో 62పరుగులు చేసి చెలరేగి ఆడుతున్నాడు.

Picture

దావన్ హాఫ్ సెంచరీ..

17/10/2020,10:25PM

చెన్నైతో మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి 36పరుగులు వద్ద ధావన్ క్యాచ్ ఇచ్చినా.. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న దీపక్‌ చాహర్‌ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. తర్వాత గబ్బర్‌ చెలరేగి ఆడుతున్నాడు.ఈ క్రమంలోనే గబ్బర్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో గబ్బర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ.

Picture

రహానె అవుట్‌

17/10/2020,10:03PM

180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండవ వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ పృథ్వీషా(0) రెండో బంతికే బౌలర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్ అవగా దీపక్‌ చాహర్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి అజింక్య రహానె(8) అవుట్ అయ్యాడు.

Picture

స్కోరు బోర్డు తెరవకుండానే వికెట్.. 0/1

17/10/2020,9:32PM

చెన్నై నిర్దేశించిన 180పరుగుల టార్గె‌తో బరిలోకి దిగిన ఢిల్లీ స్కోరు బోర్డుపై ఒక్క రన్ కూడా పడకుండానే వికెట్ కోల్పోయింది. ఓపెనర్లుగా శిఖర్ దావన్, పృద్వీ షా రాగా.. దీపక్ చాహర్‌ వేసిన ఫస్ట్ ఓవర్‌లో రెండో బంతికే దీపక్ చాహర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పృద్వీ షా. అంతే కాదు.. ఫస్ట్ ఓవర్ మేడిన్‌గా ముగిసింది.

Picture

చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 179/4 ఢిల్లీ టార్గెట్ 180

17/10/2020,9:19PM

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 34 వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య షార్జా స్టేడియంలో జరుగుతోండగా.. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ చేయగా.. రాయుడు రాణించడంతో.. జడేజా మెరుపులు కారణంగా చెన్నై జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 180 పరుగుల విజయ లక్ష్యం ఫిక్స్ అయ్యింది.

ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్) రాణించారు. చివర్లో రవీంద్ర జడేజా(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) చెలరేగడంతో చెన్నై భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో దేశ్ పాండే, రబడా చెరొక వికెట్ తీయగా.. నోర్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Picture

ఆరు ఓవర్లకు చెన్నై స్కోరు 39/1

17/10/2020,8:01PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 39పరుగులు చేసింది. ప్రస్తుతం 15బంతుల్లో 15పరుగులు చేసి షేన్ వాట్సన్, 21బంతుల్లో 25పరుగులు చేసి డూప్లెసిస్ క్రీజులో ఉన్నారు. చెన్నై స్కోరు 42/1

Picture

రెండవ ఓవర్‌లో పరుగుల్లేవ్.. చెన్నై స్కోరు 2/1

17/10/2020,7:40PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్‌లోనే ఫస్ట్ వికెట్ కోల్పోగా.. రెండవ ఓవర్ ఒక్క పరుగు కూడా జట్టుకు లభించలేదు. కగిసో రబడా వేసిన రెండవ ఓవర్‌ మేడిన్‌ అయ్యింది.

Picture

ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్.. చెన్నై స్కోరు 2/1

17/10/2020,7:37PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఫస్ట్‌లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే వేసిన ఫస్ట్ ఓవర్‌లో శామ్ కర్రన్ వికెట్‌ను చెన్నై కొల్పోయింది.

Picture

ఢిల్లీ క్యాపిటల్స్:

17/10/2020,7:30PM

పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, అన్రిచ్ నోర్జ్, తుషార్ దేశ్ పాండే

Picture

చెన్నై సూపర్ కింగ్స్:

17/10/2020,7:29PM

శామ్ కరన్, ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకుర్, కరన్ శర్మ, కేదార్ జాదవ్

Picture

తుది జట్లు:

17/10/2020,7:28PM

Picture

IPL 2020, DC vs CSK Live: టాస్ గెలిచిన చెన్నై.. ఢిల్లీ బౌలింగ్

17/10/2020,7:20PM

ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు కష్టపడుతున్న చెన్నై సూపర్‌‌కింగ్స్‌..‌ ఐపీఎల్‌‌లో మరో కీలక పోరుకు సిద్ధం అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ధోనీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. పాయింట్స్ టేబుల్‌‌లో చెన్నై ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. అధ్భుతమైన ఆటతీరుతో ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు పాయంట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుని ఢిల్లీని బౌలింగ్‌కు ఆహ్వానించింది.

Related Posts