లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

53 రోజులు, 60 మ్యాచులు, 8 జట్లు.. నేటి నుంచి IPL సంగ్రామం.. ముంబై, చెన్నై మధ్య తొలి ఫైట్

Published

on

ipl-2020-begins-from-today

నేటి నుంచి ఐపీఎల్ -13 సమరం స్టార్ట్‌ కానుంది. యూఏఈ వేదికగా ఎనిమిది జట్లు టైటిల్‌ కోసం బరిలోకి దిగుతున్నాయి. 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు అభిమానుల అలరించనున్నాయి. కాగా, కోవిడ్ నేపథ్యంలో అభిమానుల సందడి లేకుండా ఐపీఎల్‌ సమరం మొదలవుతుంది. అబుదాబి, దుబాయ్‌, షార్జా వేదికలపై 53రోజులపాటు 60మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్‌లో ఐపీఎల్‌ను మించింది లేదు. గత ఆరు నెలలుగా ఒకట్రెండు టోర్నీలు మినహా పెద్దగా క్రికెట్ జరగలేదు. ఐపీఎల్‌లో వరల్డ్ ఫేమస్ ఆటగాళ్లంతా బరిలోకి దిగుతున్నారు. దీంతో తమ ఆరాథ్య ఆటగాళ్ల గేమ్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

ఐపీఎల్‌ సీజన్‌ లీగ్‌ సంప్రదాయం ప్రకారం గతేడాది ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య అబుదాబిలో శనివారం(సెప్టెంబర్ 19,2020) తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచే హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు.. ఇప్పటిదాకా 29సార్లు తలపడ్డాయి.

ముంబై 17సార్లు విక్టరీ కొడితే.. చెన్నై 12సార్లు విజయం సాధించింది. కూల్ కెప్టెన్‌ వర్సెస్ హిట్టింగ్ కెప్టెన్‌ మధ్య మ్యాచ్‌ కచ్చితంగా ఫైనల్‌ ఫైట్‌ను తలపించేలా ఉంటుందని ఫ్యాన్స్‌ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు అబుదాబీ జాయేద్ స్టేడియం ముస్తాబైంది. యూఏఈ కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌ శనివారం సాయంత్రం 6గంటలకు స్టార్ట్‌ అవుతుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *