Home » IPL 2020, CSK vs SRH: చివరి ఓవర్లలో దగ్గుతూ.. ఇబ్బందిపడిన MS Dhoni
Published
4 months agoon
By
subhnచెన్నై సూపర్ కింగ్స్ (CSK)వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)13వ సీజన్లో చెన్నై 165పరుగుల లక్ష్య చేధనలో తడబడి 157 పరుగులు మాత్రమే చేసి మరో మ్యాచ్ చేజార్చుకుంది. సీఎస్కే కెప్టెన్ MS Dhoni .. రవీంద్ర జడేజాల మీదనే పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి.
36బంతుల్లో 47పరుగులు కొట్టిన ధోనీ.. చివరి ఓవర్లలో కాస్త ఇబ్బంది పడ్డాడు. వరల్డ్ క్రికెట్ లో ఫిట్టెస్ట్ ప్లేయర్ అయిన 39సంవత్సరాల ధోనీ శుక్రవారం పరుగులు చేసేందుకు తడబడ్డాడు. గొంతు తడి ఆరిపోవడంతో దగ్గు మొదలైందని మ్యాచ్ అనంతరం చెప్పాడు…
‘వీలైనంతవరకూ సమయం కోసం ప్రయత్నించా. ఇక్కడ చాలా పొడిగా ఉంది. గొంతు తడి ఆరిపోతే దగ్గడం మొదలవుతుంది. కాస్త సమయం ఉంటే కేటాయించడమే మంచిది. సన్ రైజర్స్ బౌలింగ్ లో హిట్టింగ్ చేయాలనే గట్టిగా ప్రయత్నించానని అనుకున్నాడట ధోనీ.
చాలా బంతులను ఎదుర్కోలేకపోయా. చాలా గట్టిగా కొట్టడానికి ప్రయత్నించా. మైదాన స్వభావం చాలా స్లోగా ఉంది. ఆ సమయంలో గట్టిగా ఆడాలనుకున్నా. మైదానం వెలుపల కాకుండా.. మా వరకూ మాత్రం బంతిని హార్డ్ హిట్టింగ్ చేయలేకతప్పలేదు. అని నాలుగింటిలో మూడో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనీ తెలిపాడు. గెలుపు కోసం ధోనీ తుది జట్టులోనూ మూడు మార్పులు చేశాడు.
‘చాలా కాలం తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయాం. చాలా విషయాలు కరెక్ట్ చేయాల్సి ఉంది. అదే ప్రొఫెషనలిజం. క్యాచ్ లు అందుకోవాలి. నో బాల్స్ వేయకూడదు. అవే కంట్రోలబుల్స్ అనుకుంటున్నా. నాకు తెలిసి రిలాక్స్డ్గా ఉంటున్నాం’ అని ధోనీ అన్నాడు.
కొన్ని సార్లు రిలాక్స్ గా కూర్చున్నాం. 16వ ఓవర్ తర్వాత మాకు రెండు మంచి ఓవర్లు దక్కాయి. ఈ లెవల్ లో ఉన్నప్పుడు క్యాచ్ లు వదిలేయాలని ఎవరూ అనుకోరు. టీం పరిస్థితి బాగాలేనప్పుడు ఒక హద్దు పట్టుకుని దానికి మించకూడదని జట్టు నిర్ణయించుకోవాలి. అని సన్రైజర్స్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయాన్ని ఉదహరణగా చెప్పాడు ధోనీ.
‘నాకౌట్ స్టేజ్ గేమ్స్ లో… క్యాచెస్ అనేవి కీలకంగా పనిచేస్తాయి. బెస్ట్ ప్రదర్శన చేయడమనేది చాలా ఇంపార్టెంట్. గేమ్ లో చాలా పాజిటీవ్స్ ఉన్నాయి. మా స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాం’ అని ధోనీ అన్నాడు.