లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

IPL 2020, CSK vs SRH: రెండు రికార్డులకు చేరువగా ధోని.. రెండు అడుగులు.. 24పరుగుల దూరంలో!

Published

on

దుబాయ్‌లో IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. నాలుగో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది.ఐపీఎల్‌లో 4500 పరుగులు:

ధోనీ 193 ఐపిఎల్ మ్యాచ్‌ల్లో 42.22 సగటుతో 4476 పరుగులు చేశాడు. 4500 మార్కుకు కేవలం 24 పరుగుల దూరంలో ఉన్నాడు. ఐపిఎల్‌లో ధోని కంటే విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్ ఎక్కువ పరుగులు చేశారు.మూడు వందల సిక్సర్లకు కేవలం రెండు అడుగులు దూరంలో..

భారత్‌ నుంచి టీ 20 క్రికెట్‌లో 300 సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా ధోని ఉన్నాడు. ధోని ఖాతాలో 298 సిక్సర్లు ఉన్నాయి. అతను 300 సిక్సర్ల మార్కుకు కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ధోనితో పాటు ఇద్దరు భారతీయ బ్యాట్స్ మెన్ మాత్రమే ఈ రికార్డు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో 371 సిక్సర్లు ఉండగా, సురేష్ రైనా 311 సిక్సర్లు కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆటగాడైన సురేష్ రైనా.. ఈసారి వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌లో ఆడటం లేదు.ఐపీఎల్ 2020లో ధోని ఆటతీరు:

ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోని ధోని అవసరం లేకుండా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ధోని 17 బంతుల్లో 29 పరుగులు చేశాడు. 7 వ నంబర్ వద్ద బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ధోని మూడు సిక్సర్లు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టుకు విజయం అవసరం అయినప్పుడు, ధోని 12 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *