లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

మ్యాచ్ గెలుస్తాం బుట్టబొమ్మ డ్యాన్స్ వేస్తాం: వార్నర్

Published

on

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. తన జట్టుపై నమ్మకం ఉంచుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఫైనల్ కు వెళ్తామని చెబుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా తమ జట్టుపై యాజమాన్యం, మేనేజ్‌మెంట్ సపోర్ట్ కు తగిన న్యాయం చేస్తామని అంటున్నాడు. వారందరితో పాటు అభిమానులకు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీని గిఫ్ట్ గా ఇస్తామని చెప్పాడు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ప్రామిస్ చేశాడు.

కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వార్నర్ టిక్ టాక్ సెన్సేషన్ గా మారాడు. ఆ సమయంలో అతని వెర్షన్ లో పాపులర్ తెలుగు సాంగ్ బుట్ట బొమ్మకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీని గెలిచి మరోసారి బుట్టబొమ్మ డ్యాన్స్ చేస్తామని చెప్పాడు.ప్లే ఆఫ్ జట్లతో పోటీపడిన హైదరాబాద్.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీపై గెలిచింది. ‘హైదరాబాద్ అభిమానులకు ప్రామిస్ చేస్తున్నా. మేం ఆ లైన్ దాటి వెళ్తే.. బుట్టబొమ్మ డ్యాన్స్ చేస్తానని డేవిడ్ వార్నర్ శనివారం వెల్లడించాడు.

పర్సనల్‌గా ఇది నాకు చాలా పెద్ద విషయం. రెండేళ్ల క్రితం నేను సీజన్ ను మిస్ అయ్యాను. జట్టు పరుగులు బోర్డు మీద చూడటానికి, క్రికెట్ ప్లేయర్ గా నా విలువ చూపించడానికి ఎదురుచూశా. ఈ టీం నాకు చాలా ఎక్కువ. ఇదొక కుటుంబం. ఇండియా నా రెండో ఇల్లుగా ఫీలవుతా. ఈ జట్టు మీద నాకు చాలా ఆసక్తి.

రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా. నన్ను వేలంలో కొనుగోలు చేయడానికి టీం సపోర్ట్ బాగా దొరికింది. 2016లో నాకు జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. నేను లేని సమయంలో కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ ముందుండి జట్టును నడిపించారు. దానికి చాలా ప్లానింగ్, హార్డ్ వర్క్, ప్రిపరేషన్ కావాలి.

అభిమానుల మొహాల్లో నవ్వులు చూడాలనుకోవడం పర్సనల్‌గా నా అభిప్రాయం. గత వారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కాస్త కంగారుపడ్డాడట. కానీ, విలియమ్సన్, జాసన్ హోల్డర్ దాని నుంచి బయటపడేశాడట. 132 పరుగుల లక్ష్య చేధనను దాటేసి మ్యాచ్ గెలిపించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *