IPL 2020: ఢిల్లీ స్పిన్ VS పంజాబ్ మిడిల్ ఆర్డర్, టాస్ గెల్చి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

IPL 2020: DC vs KXIP: రెండుజట్లలోనూ ఉరకలెత్తే కుర్రాళ్లున్నారు. చూపించాల్సింది చాలానే ఉంది.

ఇప్పుడున్న ఎనిమిది IPL franchisesలో మూడు జట్లు ఇంతవరకు కప్ గెలవలేదు. అందులో రెండు Dubai International Stadiumలో ఈరోజు తలపడుతున్నాయి. Delhi Capitalsకు కుర్రాళ్లే బలం. అందులోనూ పంతలాంటి ఆటగాడున్నాడు. Kings XI Punjab ట్రోఫీని గెల్చే జట్టుతోనే వచ్చింది.

Glenn Maxwell, R Ashwin, Marcus Stoinisలాంటి సూపర్ స్టార్లున్నారు. ఒక్కరు చాలు అటు మ్యాచ్‌ని ఇటు మార్చగలరు.



వీళ్లంతా ఒకప్పుడు ఈ రెండు జట్లలోనూ ఆడారు. అంటే ఒకరికి మరొకరు కొత్తకాదు. ఎవరు ఎలా ఆడతారో ఇద్దరికీ తెలుసు.

నిజానికి జట్టును తీర్చిదిద్దడంలో ఢిల్లీ బాగా వర్క్ చేసింది. ఆటగాళ్లను ఏరికోరి తెచ్చుకుంది. అందరూ కుర్రాళ్లే. జాతీయ జట్టులో ఆడుతున్నావాళ్లే. కాకపోతే ఒకటే చిక్కు. ప్రొసస్ ఇంకా పూర్తయినట్లు లేదు. ఇదే సమస్య పంజాబ్‌ది.



రెండుజట్ల బలాలేంటో, బలహీనతలేంటో మనకు తెలుసు. ఉన్న ఆటగాళ్లను విదేశీ గడ్డమీద ఎలా ఉపయోగించుకుంటారన్న దానిమీదనే గెలుపు ఆధారపడింది.

కేపిటల్ ఓ తురుపు ముక్కను కనిపెట్టింది. 43 ఐపీల్ మ్యాచ్ లాడిన హర్ష పటేల్, సునీల్ నరైన్ లాంటి విధ్వంసకర పాత్రను పోషించగలరు. అంతెందుకు Syed Mushtaq Ali Trophyలో 165 స్ట్రక్ రేట్ తో ఏకంగా 374 రన్స్ చేశాడు. పంజాబ్‌‌కు ఓపెనింగ్ ఓవర్లలో షాక్ ఇవ్వాలంటే ఓపెనర్‌గా రావచ్చు.



గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రెడీ చేసింది పంజాబ్. Nicholas Pooran సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లేలో Mujeeb Ur Rahman ఎలా బ్యాట్స్‌మెన్‌ను కంట్రోల్ చేయగలడో ఢిల్లీకి తెలుసు. మరి chris Gayle సంగతేంటి? ఓపెనర్ గా రావచ్చు. నాలుగో విదేశీ ఆటగాడుగా Chris Jordan లేదంటే James Neeshamను తీసుకోవచ్చు.

మిడిల్ ఆర్డర్ మీదనే పంజాబ్ నిలకడ ఆధారపడి ఉంది. వచ్చే మ్యాచ్‌ల్లో అశ్విన్‌కున్న సమస్య ఇదే. ఢిల్లీకి మిడిల్ ఆర్డరే సమస్య. Marcus Stoinis టాప్ ఆర్డర్. Keemo Paul లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. ఒకవేళ Alex Carey ఆడితే మిడిల్ ఆర్డర్ లో ఈ ముగ్గురిని ఎలా సర్దుబాటు చేస్తారు? చూడాలి.



Mujeeb ఓపెనింగ్ బౌలర్ అయినా, ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీయడానికి సెకండ్ చేంజ్ బౌలర్ గా వాడొచ్చు. Shimron Hetmyer, Rishabh Pantని రెండేసి సార్లు అవుట్ చేశాడు.

ఢిల్లీకి బెస్ట్ స్పిన్నింగ్ బౌలింగ్ యూనిట్ ఉంది. Maxwellను ఎలా కట్టడిచేస్తారో చూడాలి. స్పిన్‌లో 171 స్ట్రయిక్‌రేటుంది.R Ashwinని చితక్కొట్టాడు. కాకపోతే అమిత్ మిశ్రా చేతిలో నాలుగు సార్లు ఔట్. ఒకవేళ మిశ్రా బరిలోకి దిగితే…Maxwellకు బౌల్ చేస్తాడు.



Related Posts