కోల్‌కత్తా కెప్టెన్సీ నుంచి కార్తీక్ అవుట్.. కెప్టెన్‌గా వరల్డ్ కప్ విజేత!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత కెప్టెన్ దినేష్ కార్తీక్ తన కెప్టెన్సీని ఎయోన్ మోర్గాన్‌కు అప్పగించినట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే దినేష్ కార్తీక్ బాగా ఆడాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలిచినా కూడా దినేష్ కార్తీక్ ప్రభావం అందులో నామమాత్రమే. కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లు ఆ జట్టుకు కీలకం.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కార్తీక్ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు జట్టు వెల్లడించింది. బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు తాను కెప్టెన్సీని వదులుకుంటున్నానని దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు. ఇయాన్ మోర్గాన్‌తో చర్చించిన తర్వాత తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కార్తీక్ తెలిపాడు. కేకేఆర్ జట్టుకు 37 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించిన కార్తీక్ తన కెప్టెన్సీ మార్క్ చూపించలేదు. అయితే కెప్టెన్సీ తనకు భారంగా మారినట్లుగా భావించి ఇయాన్ మోర్గాన్‌కు కోల్‌కత్తా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 4 మ్యాచ్‌లలో నెగ్గి, 3 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. కోల్‌కత్తా తీసుకున్న నిర్ణయంతో ఐపీఎల్‌లో ప్రస్తుతం మూడు జట్లకు విదేశీ కెప్టెన్లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తూ ఉండగా.. మోర్గాన్ కూడా కెప్టెన్‌గా మారారు.2019 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ జట్టును నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోల్‌కత్తాకు కెప్టెన్‌గా మారడంతో ఈ సీరీస్ కప్‌ను కూడా మోర్గాన్ కైవసం చేసుకుంటాడా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

2018లో దినేష్ కార్తీక్ గౌతం గంభీర్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోడా.. 2019 సీజన్‌లో దినేష్ కార్తీక్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. నెట్ రన్ రేట్ కారణంగా కోల్‌కతా ప్లే ఆఫ్ అర్హత సాధించలేదు. దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 19 మ్యాచులో విజయం సాధించగా 16 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్‌లోకి 2015లో అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కెరీర్‌ను ప్రారంభించాడు. 2017లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. రూ.5.25 కోట్లుతో కోల్‌కతా జట్టు మోర్గాన్‌ను కొనుక్కొంది.

READ  KKRvsRCB: ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 2వ విజయం

Related Posts