లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

IPL 2020 Final: విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Published

on

IPL-2020-Final

IPL 2020 సీజన్ ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. 8జట్లు కలిసి ఆడిన 59 మ్యాచ్‌లలో ఉత్కంఠభరితమైన ముగింపుల తర్వాత ట్రోఫీ కోసం జరిగే పోరుపై భారీ అంచనాలు మొదలయ్యాయి. మరి ట్రోఫీతో పాటు వచ్చే మొత్తం గెలిచిన జట్టుకు వస్తుందా.. అది ఎంత.. అనే దానిపై బీసీసీఐ ముందుగానే క్లారిటీ ఇచ్చింది.

ఏటా ఇచ్చే దానిలో సగం మాత్రమే ఇస్తామని సీజన్ ఆరంభానికి ముందే తెలిపింది. గత సీజన్లో ప్రైజ్ మనీ 32.5కోట్లు కాగా విన్నర్స్ జట్టు ముంబై ఇండియన్స్ రూ.20కోట్లు వసూలు చేసింది. రన్నరప్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ రూ.12.5కోట్లు తీసుకెళ్లింది. అంటే ఐపీఎల్ 2020 సీజన్ విన్నర్, రన్నర్ టీంలలో ప్రైజ్ మనీని హాఫ్ షేర్ మాత్రమే తీసుకెళ్తారు. అంటే ఈ ఏడాది విన్నర్ టీం రూ.10కోట్లు, లూజర్ టీం రూ.6.25కోట్లు తీసుకెళ్తుంది.‘కాస్ట్ కటింగ్ నియమాల ప్రకారం.. ఫైనాన్షియల్ రివార్డ్స్ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ రూ.20కోట్లకు బదులుగా రూ.10కోట్లు ఇస్తారు. రన్నర్సప్ రూ.12.5కోట్లకు బదులు రూ.6.25కోట్లు ఇస్తారు’ అని బీసీసీఐ ఓ నోటిఫికేషన్ లో చెప్పింది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కనిపించిన తర్వాత చేసిన ప్రకటన ఇలా ఉండగా ఆ తర్వాత ఆ అమౌంట్ లో హెచ్చుతగ్గుల గురించి బీసీసీఐ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ప్రతి జట్టును సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు.

‘ఫ్రాంచైజీలు ఆర్థికంగా పరవాలేదు. వారి ఆదాయం పెంచుకునేందుకు చాలా స్పాన్సర్‌షిప్‌లు ఉన్నాయి. అందుకే ప్రైజ్ మనీ గురించి అలాంటి నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌‌కు కరోనా కష్టంతో పాటు ఆరంభంలో కొత్త స్పాన్సర్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంది. వీవో తప్పుకున్న తర్వాత చాలా కాలం చర్చలు జరిపి ఎట్టకేలకు డ్రీమ్ ఎలెవన్‌కు స్పాన్సర్‌షిప్ దక్కింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *