IPL 2020: IPLని ఫ్రీగా చూడాలా? 4 రకాలుగా Disney+ Hotstarలో ట్రైచేయండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

IPL 2020 ON Disney+ Hotstar: IPL 2020లో ఫస్ట్ మ్యాచ్ Mumbai Indians, Chennai Superల మధ్య. ఆరునెలల వెయింటింగ్. మొత్తానికి IPL 2020 టీవీల మీదకొచ్చింది. ల్యాప్ ట్యాప్, మొబైల్ సంగతి మర్చిపోవద్దు. క్రికెట్ కోసం అర్రలుచాచే దేశానికి IPL అంటే… ఫుల్ మీల్స్ లాంటిదే. IPLను ప్రసార హక్కులు Star Networkకు ఉన్నాయి. స్టార్ డిజిటల్ వింగ్ Disney+ Hotstarలు మ్యాచ్‌లను streaming చేస్తాయి.

IPL 2020‌షెడ్యూల్‌ విడుదల…ఏ మ్యాచ్ ఎప్పుడో చూడండి


IPL మ్యాచ్ లను వాచ్ చేయాలంటే subscription options ఉన్నాయి. IPL live stream రెండురకాలుగా Premium, VIPగా వాచ్ చేయొచ్చు. మొత్తం స్పోర్ట్స్ అన్నింటినీ చూడాలంటే Disney+ Hotstarలకు VIP subscription కావాలి. రేటు తక్కువే.యేడాదికి Rs 399. ఒక్కనిమషం.. IPL 2020ని ఫ్రీగా చూడాలనుకొంటున్నారా? చదవండి.

1.Reliance JioFiber Membership

లేటెస్ట్‌గా IPLని దృష్టిలో పెట్టుకొనే Jiofiber plansని అప్ డేట్ చేసింది. అలాగే స్ట్రీమింగ్ లో ఆఫర్స్ ఇచ్చింది. Disney+, Hotstar అందులో ఒకటి. The Jiofiber Gold, Diamond, Diamond+, Platinum plans. ఏ ప్లాన్ తీసుకున్నా Disney+ Hotstar, Sony LIV, Voot and Zee5 కామన్. రేటు కాస్త ఎక్కువ. రూ.999, 1499, 2499 ఇంకా 3999 వరకు ప్లాన్లున్నాయి. ప్లాన్ రేటు పెరిగేకొద్దీ, స్పీడు పెరుగుతుంది.



2. Flipkart Supercoins
యేడాది క్రితం Flipkart ఓ పద్దతిని మొదలుపెట్టింది. పేరు Supercoins. కొనే ప్రతి వందకి రెండు క్వాయిన్స్ అంది. మీదగ్గర కనుక ఇవి ఉన్నాయంటే Disney+ Hotstar Subscription కొనుక్కోవచ్చు. VIP subscriptionని 399 సూపర్ క్వాయిన్స్ తో కొనొచ్చు. మీకు Premium కావాలా? 1499 Supercoinsతో కొనండి.



3. Reliance Jio Cricket Pack
మీరుకనుక Jio prepaid వాడుతుంటే మీకు ఉత్సాహాన్ని ఇచ్చే వార్త మీకోసమే. Disney+ Hotstar VIP subscriptionని Jio Cricket Packతో కలిపేశారు. అంటే రూ 401 పెడితే 28 రోజులు ఐపీల్‌ను వాడుకోవచ్చు. అదే రెండునెలలు కావాలంటే రూ.499 పట్టండి.



4. Airtel Ticket to Cricket
ఇది ఎయిర్ టెల్ ఇచ్చే సూపర్ ప్లాన్. జియాలాగే Airtelకూడా Disney+ Hotstar subscription ఇస్తోంది. కాకపోతే రూ.599 rechargeకి మాత్రమే ఈ అవకాశం. 56రోజులు వాడుకోవచ్చు. నెలచాలనుకొంటే రూ.448 పెట్టండి. రూ.2698 పెడితే యేడాది మొత్తం ఉపయోగించుకోవచ్చు.


Related Posts