లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

IPL 2020, KXIP vs RR: బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Published

on

IPL‌‌‌‌ 2020 సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. హోరాహోరీ పోరులో.. చావోరేవే తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పంజాబ్‌పై టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనూహ్యంగా వరుస 5 విజయాలు అందుకొని పంజా విసురుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్లే ఆఫ్‌‌ స్థానం కోసం జరుగుతున్న మ్యాచ్‌‌ ఫలితం‌‌‌ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌‌‌కు తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఓడిపోతే ప్లే ఆఫ్‌‌‌‌ పోటీ నుంచి తప్పుకున్నట్లే. మరోపక్క రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది పంజాబ్‌‌‌‌. ఈ సీజన్ తొలి భాగంలో ఇరు జట్ల మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది.

పిచ్ రిపోర్టు:

దుబాయ్ పిచ్ చేజింగ్‌కు అనుకూలిస్తుండగా చివరి రెండు మ్యాచ్‌ల్లో అదే జరిగింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వనున్నారు.

రాజస్థాన్ జట్టు:

పంజాబ్ జట్టు:

ముఖా ముఖి:

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబే విజయం సాధించింది.