IPL 2020, SRH vs KKR LIVE: హైదరాబాద్‌పై కోల్‌కత్తా సూపర్ విన్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp
Picture

కోల్‍‌కతా సూపర్ విన్..

18/10/2020,7:50PM

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్‌ విన్ అయ్యింది. మ్యాచ్‌లో రెండు జట్టు ఒకే స్కోరు చెయ్యగా.. సూపర్ ఓవర్‌కు మ్యాచ్ వచ్చింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. అనంతరం కోల్‌కతా మూడు పరుగులు చేసి ఈజీగా గెలిచింది. అంతుకుముందు కోల్‌కతా నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(47 నాటౌట్‌; 33 బంతుల్లో 5×4), అబ్దుల్‌ సమద్‌(23; 15 బంతుల్లో 2×4, 1×6) రాణించినా ఫలితం తేలలేదు.

Picture

హైదరాబాద్‌, కోల్‌కతా మ్యాచ్‌ టై..

18/10/2020,7:34PM

ఉత్కంఠ భరితంగా సాగిన కోల్‌కతా×హైదరాబాద్‌ మ్యాచ్ చివరకు టైగా ముగిసింది. చివరి ఓవర్‌లో హైదరాబాద్ జట్టుకు విజయానికి 18 పరుగులు అవసరం అవ్వగా రసెల్‌ బౌలింగ్ చేశాడు. అయితే రసెల్ తొలి బంతిని నోబాల్ వేయగా ఫ్రీహిట్‌లో రషీద్‌ఖాన్ ఒక్క పరుగు చేసి వార్నర్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. వార్నర్‌ వరుసగా మూడు ఫోర్లు బాదడంతో విజయానికి 2 బంతుల్లో 4 పరుగులు అవసరం అయ్యాయి. తర్వాత బంతికి ‌వార్నర్‌ రెండు పరుగులు చేయగా, ఆఖరి బంతికి ఒక్క పరుగు తీయడంతో 17పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలడానికి రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడనున్నాయి.

Picture

18బంతుల్లో 37పరుగులు.. స్కోరు 127/5

18/10/2020,7:06PM

హైదరాబాద్ జట్టు 17ఓవర్లలో 5వికెట్లు నష్టానికి 127పరుగులు చెయ్యగా.. 18బంతుల్లో 37పరుగులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం క్రీజులో వార్నర్, సమద్ ఉన్నారు.

Picture

5వేల మైలురాయి చేరుకున్న వార్నర్‌

18/10/2020,7:02PM

T20 క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ 5 వేల పరుగుల మైలురాయి దాటాడు. కమిన్స్‌ వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌ తీసిన వార్నర్.. టోర్నీలో 5వేల పరుగుల మైలురాయి దాటిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకు ముందు కోహ్లీ, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ ఈ ఘనతను దక్కించుకున్నాడు.

Picture

5వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. స్కోరు 109/5

18/10/2020,6:55PM

కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్‌(Lockie Ferguson) తన మూడో వికెట్‌ తీశాడు. 12వ ఓవర్‌ మూడో బంతికి మనీష్‌ పాండే(6)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో హైదరాబాద్‌ 82 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. తర్వాత కాసేపు వార్నర్‌కు తోడుగా నిలిచిన విజయ్ శంకర్ 10బంతుల్లో 7పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోరు 15.2ఓవర్లలో 109/5గా ఉంది.

Picture

మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. స్కోరు 80/3

18/10/2020,6:27PM

కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదారాబాద్ జట్టు జాగ్రత్తగా ఆడుతుంది. అయితే స్కోరు బోర్డుపై 70పరుగులుకు మూడు వికెట్లు కోల్పోయింది. లాకీ ఫెర్గూసన్‌(Lockie Ferguson) వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి కేన్‌ విలియమ్సన్‌(29) భారీ షాట్‌ ఆడగా నితీశ్‌ రాణా చేతికి చిక్కి అవుట్ అవగా.. తర్వాత మళ్లీ లాకీ ఫెర్గూసన్‌ వేసిన తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి ప్రియమ్‌గార్గ్‌(4) బౌల్డ్ అయ్యి అవుట్ అయ్యాడు. అనంతరం వరుణ్‌ చక్రవర్తి వేసిన పదో ఓవర్‌ రెండో బంతికి భారీ షాట్‌ ఆడబోయి బెయిర్‌స్టో(36) ఆండ్రూ రసెల్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్‌ 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 11ఓవర్లు ముగిసేసరికి వార్నర్(4), మనీష్ పాండే(5) క్రీజులో ఉన్నారు.

Picture

నాలుగు వికెట్లు కోల్పోయాక.. కోల్‌కత్తా స్కోరు 133/4

18/10/2020,5:06PM

రషీద్‌ఖాన్‌ వేసిన 12వ ఓవర్‌లో శుభ్‌మన్‌గిల్‌(36) ఔటయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. గిల్‌ ఔటయ్యాక రసెల్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా రస్సెల్ ప్రభావం ఏం లేదు. నటరాజన్‌ వేసిన 15వ ఓవర్‌లో ఆండ్రూరసెల్‌(9) అవుటయ్యాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలొ బౌండరీ లైన్‌ వద్ద విజయ్‌ శంకర్‌ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. అంతకు ముందు విజయ్‌ శంకర్‌ వేసిన 13వ ఓవర్‌ తొలి బంతికి నితీశ్‌ రాణా(29) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇయాన్‌ మోర్గాన్‌, దినేష్ కార్తీక్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కోల్‌కత్తా స్కోరు 133/4 వద్ద ఉంది.

Picture

త్రిపాఠి అవుట్.. స్కోరు 62/1

18/10/2020,4:09PM

బాసిల్‌ థంపి వేసిన ఐదో ఓవర్‌లో సుబ్మాన్‌గిల్‌ మూడు బౌండరీలు తరలించగా.. రాహుల్‌ త్రిపాఠి జోరుగా ఆడుతూ.. నటరాజన్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి 23పరుగులకు బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 48 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

Picture

గిల్ క్యాచ్ డ్రాప్.. కోల్‌కత్తా స్కోరు 42/0

18/10/2020,3:48PM

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్లుగా సుబ్మాన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి దిగారు. సందీప్‌ శర్మ సన్‌రైజర్స్ తరపున ఫస్ట్ ఓవర్ వెయ్యగా.. బాసిల్‌ థంపి వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి గిల్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డీప్‌మిడ్‌ వికెట్‌లో ఆడిన షాట్‌ను రషీద్‌ఖాన్‌‌కు క్యాచ్‌ ఇవ్వగా.. బ్యాలెన్స్ కోల్పోయి క్యాచ్ వదిలేశాడు.

Picture

తుది జట్లు:

18/10/2020,3:17PM

Picture

Kolkata Knight Riders (Playing XI):

18/10/2020,3:14PM

Rahul Tripathi, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w), Eoin Morgan(c), Andre Russell, Pat Cummins, Shivam Mavi, Kuldeep Yadav, Lockie Ferguson, Varun Chakravarthy

Picture

Sunrisers Hyderabad(Playing XI):

18/10/2020,3:14PM

David Warner(c), Jonny Bairstow(w), Manish Pandey, Kane Williamson, Priyam Garg, Vijay Shankar, Abdul Samad, Rashid Khan, Sandeep Sharma, T Natarajan, Basil Thampi

Picture

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కత్తా బ్యాటింగ్!

18/10/2020,3:07PM

 అబుదాబి వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13లో మరో సూపర్‌ పోరు సిద్దమైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లు ఈ సీజన్‌లో రెండవసారి పోరాటానికి సిద్ధం అయ్యాయి. గత మ్యాచ్‌ లోపాలను సరిదిద్దుకొని బరిలో దిగుతున్న ఇరు జట్లూ విజయంపై కన్నేశాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Related Posts