IPL 2020 KXIP vs MI: పంజాబ్‌పై ముంబై ఘన విజయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp
Picture

పంజాబ్‌పై ముంబై ఘన విజయం

01/10/2020,11:22PM

192పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 8వికెట్లు నష్టపోయి కేవలం 143పరుగులు మాత్రమే చేయడంతో 48పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

Picture

పూరన్ అవుట్.. పంజాబ్ స్కోర్ 101/4

01/10/2020,10:46PM

నిలకడగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ పంజాబ్ జట్లు స్కోరు ముందుకు సాగించిన పూరన్ అవుట్ అయ్యాడు. 27బంతుల్లో 44పరుగులు చేసి పాటిన్సన్ బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Picture

పంజాబ్ స్కోరు 87/3

01/10/2020,10:26PM

మొదట్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్లు ఆచితూచి ఆడుతుంది. అవసరమైన షాట్లు ఆడుతూనే నిలకడగా స్కోరు వచ్చేలా చేస్తుంది. మ్యాక్స్‌వెల్, పూరన్ జాగ్రత్తగా ఆడుతున్నారు.

Picture

మూడవ వికెట్‌గా కెప్టెన్ రాహుల్

01/10/2020,10:15PM

ముంబై ఇండియన్స్‌లో మ్యాచ్‌లో పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయింది. మూడవ వికెట్‌గా కెప్టెన్ రాహుల్ అవుట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న జట్టును నిలబెడుతున్నాడు అనుకునే టైమ్‌లో 19బంతుల్లో 17పరుగులు చేసి చాహర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

Picture

చేజింగ్‌లో తడబడుతున్న పంజాబ్.. రెండు వికెట్లు ఫట్

01/10/2020,10:06PM

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 192పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు తడబడుతూ ఆడుతుంది. ఇన్నింగ్స్‌ మొదట్లోనే రెండు వికెట్లను జట్టు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ ఇద్దరు కూడా బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రాహుల్, నికోలస్ పూరన్ ఉన్నారు.

Picture

KXIP vs MI LIVE స్కోరు IPL 2020: పంజాబ్ టార్గెట్ 192

01/10/2020,9:31PM

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ మరియు తరువాత కీరోన్ పొలార్డ్, పాండ్యా తుఫాను ఇన్నింగ్స్‌తో, ముంబై ఇండియన్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. ముంబై జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 70 పరుగులు చేశారు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున, షెల్డన్ కాట్రెల్, మహ్మద్ షమీ, కృష్ణప్ప గౌతమ్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. పోలార్డ్ 20బంతుల్లో 47పరుగులు కొట్టగా.. పాండ్యా 11బంతుల్లో 30పరుగులు చేశాడు.

Picture

01/10/2020,9:11PM

ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో తన 5వేల పరుగుల మార్క్ చేరుకున్నారు. నాలుగో వికెట్‌గా రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 8 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.

Picture

రోహిత్ అవుట్.. క్రీజులో పాండ్యా, పోలార్డ్

01/10/2020,9:10PM

ఐపిఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నాల్గవ వికెట్‌గా రోహిత్ శర్మ 70పరుగులు చేసి అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 45 బంతుల్లో 70పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ప్రస్తుతం క్రీజులో పొలార్ట్, పాండ్యా ఉన్నారు.

Picture

50పరుగులు చేసిన రోహిత్ శర్మ

01/10/2020,8:45PM

పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న జట్టును నిలబెడుతున్నారు. 40బంతుల్లో రోహిత్ శర్మ 53పరుగులు పూర్తి చేసుకున్నారు. నీషామ్ వేసిన బంతిని ఫోర్ గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.

Picture

ఇషాన్ కిషన్ అవుట్

01/10/2020,7:44PM

ఐపిఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. మూడవ వికెట్‌గా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యారు. 14 ఓవర్ల తర్వాత జట్టు స్కోరు 87/3గా ఉంది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు, పొలార్ట్ 3బంతుల్లో 2 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 50పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను కిష్టప్ప గౌతమ్ బ్రేక్ చేశాడు.

Picture

ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లోకి రోహిత్

01/10/2020,7:36PM

కింగ్స్ XI పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐపీఎల్‌లో ఫోర్ కొట్టడం ద్వారా 5వేల పరుగుల క్లబ్‌లోకి రోహిత్ శర్మ చేరుకున్నారు.

Picture

ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్.. ముంబై స్కోరు 0/1

01/10/2020,7:31PM

షేక్ జాయెద్ స్టేడియంలో కింగ్స్ XI పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కాట్రెట్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ డకౌట్ అయ్యాడు.

Picture

Kings XI Punjab Playing XI:

01/10/2020,7:06PM

KL రాహుల్ (c/wk), మయాంక్ అగర్వాల్, గ్లెన్ మాక్స్‌వెల్, జేమ్స్ నీషామ్, నికోలస్ పూరన్, నాయర్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్.

Picture

Mumbai Indians Playing XI:

01/10/2020,7:05PM

క్వింటన్ డి కాక్(WK), రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా.

Picture

టాస్ గెలిచిన కింగ్స్ XI పంజాబ్.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్

01/10/2020,7:00PM

షేక్ జాయెద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, కింగ్స్ XI పంజాబ్ జట్లు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ XI పంజాబ్.. బౌలింగ్ ఎంచుకుని ముంబై ఇండియన్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Picture

మ్యాచ్ ఎక్కడంటే?

01/10/2020,6:53PM

ఈ మ్యాచ్ అబుదాబి మైదానంలో జరుగుతుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అబుదాబిలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఇక్కడ ఉంది. 2 మ్యాచ్‌లు ఈ సీజన్‌లో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగాయి. వీటిలో ముంబై ఒకదానిలో గెలవగా.. ఒకదానిలో ఓడిపోయింది. ఈ మైదానంలో పంజాబ్ తొలిసారి ఆడబోతుంది. ఈ పిచ్‌లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 139గా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ 129గా ఉంది.

Picture

అందరూ గొప్ప ఆటగాళ్లే.. కానీ ఆడట్లేదు..

01/10/2020,6:48PM

ముంబై బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగం చాలా సమతుల్యంగా కనిపిస్తుంది. జట్టులో అందరూ గొప్ప ఆటగాళ్లే.. కానీ ఆడట్లేదు.. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ వంటి టాప్ ఆర్డర్లో బ్యాట్స్ మెన్లు ఉన్నారు. పొల్లార్డ్ మరియు హార్థిక్ పాండ్యా వంటి దూకుడు బ్యాట్స్ మెన్ ఉన్నారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ముంబైకి ఉన్నాడు.


అయితే ఇంతమంది ఉన్నా కూడా ఒక్కరిలో కూడా నిలకడ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. బూమ్రా అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతని ఆటతీరుతో ఆకట్టుకోలేదు. బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మ్యాచ్ గెలుపు విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా అవతరించడానికి రోహిత్ శర్మ కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు.

Picture

ఫామ్‌లో రాహుల్, మయాంక్:

01/10/2020,6:47PM

కింగ్స్ ఎలెవన్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు అవకాశం రాలేదు, కానీ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫామ్ కారణంగా బ్యాటింగ్ బలంగా ఉంది. ముంబై మ్యాచ్ గెలవాలంటే, వారిద్దరినీ ఆదిలోనే అవుట్ చేయాలి. రాహుల్, అగర్వాల్ ఇద్దరూ ఇప్పటివరకు చెరొక సెంచరీ సాధించారు. రాయల్స్‌తో మ్యాచ్‌లో వారు మొదటి వికెట్‌కు 183 పరుగుల పార్ట్‌నర్‌షిప్ సాధించారు. ఈ సీజన్‌లో టాప్ ప్లేయర్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు పంజాబ్ జట్టు నుంచే ఉన్నారు. అలాగే టాప్ బౌలర్ షమీ కూడా పంజాబ్ జట్టులోనే ఉన్నారు.

Picture

కింగ్స్ ఎలెవన్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే..

01/10/2020,6:46PM

రాజస్థాన్ రాయల్స్‌పై మంచి బ్యాటింగ్ ఉన్నప్పటికీ ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 224 లక్ష్యాన్ని ఇచ్చి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. ఇది జట్టుకు తీవ్ర ఎదురుదెబ్బ. షెల్డన్ కాట్రెల్ ఒక ఓవర్లో రాహుల్ టెవాటియా చేత ఐదు సిక్సర్లు కొట్టించగా.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ముహమ్మద్ షమీ కూడా నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా, మునుపటి మ్యాచ్‌లో ఏ బౌలర్ ప్రభావం చూపలేకపోయాడు.

Picture

IPL 2020, KXIP VS MI:

01/10/2020,6:39PM

ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్ జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లో పోరాటానికి సిద్ధం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను ఓడించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో మ్యాచ్‌లో చిన్న తప్పిదాలు కారణంగా మ్యాచ్ కోల్పోయింది. పొలార్డ్, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడినా కూడా చివరికి సూపర్ ఓవర్‌లో ఓటమిని చవిచూసింది.

Related Posts