లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్

Published

on

IPL 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడిన మ్యాచ్ లో అద్బుతమైన ప్రదర్శన చేసిన సాహాకు గాయం అయినట్లు వార్నర్ వెల్లడించాడు. 45బంతులకు 87పరుగులు చేసిన సాహా అతనికి స్థానం కల్పించినందుకు తగిన న్యాయం చేశాడు. ‘దురదృష్టవశాత్తు అతనికి తొడపై భాగంలో గాయం అయింది. అది అంత పెద్ద ప్రమాదం కాదు’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే సాహా ఆస్ట్రేలియాకు వెళ్లనున్న ఇండియన్ టీంలో ఉన్నాడు. వచ్చే నెల భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ఈ మేరకు జాతీయజట్టు ప్లేయర్లను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

‘ఇదంత ప్రమాదకరమేమీ కాదు. ఓ మూడు రోజులు గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది’ అని అక్టోబరు 31న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మరో రెండు గేమ్స్ స్కిప్ చేయొచ్చు. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్తే సాహా మళ్లీ ఫిట్‌నెస్ సాధించి ఆడతాడని సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రషీద్ ఖాన్ కూడా సాహా గాయం గురించి మాట్లాడుతూ.. త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు వివరించాడు.