ఐపీఎల్ 2020: బోణీ కొట్టిన కోహ్లీసేన.. మెరిసిన పాడిక్కల్.. సన్‌రైజర్స్‌ ఒటమి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. దేవదత్ పడ్డికల్, ఎబి డివిలియర్స్ అర్ధ సెంచరీలు చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి 20 ఓవర్లలో 163 ​​పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 19.4 ఓవర్లలో 153 పరుగులకే కట్టడి చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
యంగ్ క్రికెటర్ దేవదత్త పాడికల్, వెటరన్ ప్లేయర్ ఎబీ డివిలియర్స్ అర్ధ సెంచరీల తర్వాత యుజ్వేంద్ర చాహల్ అధ్భుతమైన బౌలింగ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 10 పరుగుల తేడాతో ఓడించి లీగ్‌లో ఫస్ట్ మ్యాచ్ కైవసం చేసుకుంది.యంగ్ క్రికెటర్ దేవదత్త పాడికల్ 42 బంతుల్లో చాలా క్లాస్‌గా ఆడుతూ.. ఎనిమిది ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేశాడు, ఐపిఎల్‌లో తొలి మ్యాచ్‌లోనే పాడికల్ 42 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేయగా, డివిలియర్స్ 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకే అవుట్ అయ్యింది. జానీ బెయిర్‌స్టో (43 బంతుల్లో 61, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మనీష్ పాండే (33 బంతుల్లో 34, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
ఒక సమయంలో సన్‌రైజర్స్ రెండు వికెట్లకు 121 పరుగులు చేసినప్పటికీ వారు చివరి ఎనిమిది వికెట్లను 26 బంతుల్లో మరియు 32 పరుగులకు కోల్పోయారు. చాహల్ నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. శివం దుబే (15/2), నవదీప్ సైని (25/2) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు.

రెండో ఓవర్లోనే సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (6) దురదృష్టవశాత్తు రనౌట్ అయారు. బెయిర్‌స్టో, మనీష్ పాండే ఇద్దరూ మ్యాచ్‌ను నిలబెట్టారు. బెయిర్‌స్టో 37 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గాయంతో బయటకు మిచెల్ మార్ష్:
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. ఆర్‌సీబీకి బౌలింగ్ వేస్తున్న సమయంలో గాయం పాలయ్యారు. మార్ష్ కాలు అతనిని బాగా బాధ పెట్టింది. అయితే చివర్లో కాలు నొప్పితోనే బ్యాటింగ్ కోసం వచ్చాడు కానీ, వచ్చిన వెంటనే అవుట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

READ  టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్: రాహుల్‌ను తప్పించినట్లే

అంతకుముందు పాడికల్ తొలి ఓవర్ నుండే ఆత్మవిశ్వాసంతో ఆడాడు. బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం చుట్టూ అధ్భుతమైన ఫోర్లు కొట్టాడు. పాడికల్, ఫించ్ మొదటి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. దీంతో ఆర్‌సీబీ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక పాడికల్ ఆటతీరుపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.


Related Posts