ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేకుండా ఐపీఎల్.. ఎంకరేజ్‌మెంట్ కోసం కొత్త ఆలోచన!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్‌లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్‌కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్‌గా బౌలింగ్ వేసి వికెట్లు తీసేవారు.. టీవీల ముందు కోట్లాది ప్రేక్షకులు.. యూఏఈ పిచ్‌‌లలో హీరో ఎవరో.. జీరో ఎవరో? కరోనా కారణంగా ఎప్పుడో జరగాల్సిన మ్యాచ్‌లు వాయిదా పడి ఇప్పుడు జరుగుతున్నాయి.

ఏదైతేనేం మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు వినబడవు. ఈలులు ఉండవ్.. హంగామా చేసే అభిమానులు ఉండరు. నియమాలు కూడా కాస్త ఎక్కువే.. ఐపీఎల్ అంటేనే అభిమానుల కోలాహలం.. ఇష్టమైన క్రికెటర్లు సిక్సర్లు కొడితే కేరింతలు కొట్టేస్తుంటారు అభిమానులు. ఎగిరి గంతులు వేస్తుంటారు. అయితే ఈసారి కరోనా ముప్పుతో వారిని స్టేడియాల్లోకి అనుమతించట్లేదు. ఆటగాళ్లకు సైతం ఇదంతా కొత్తగానే అనిపిస్తోంది.

అప్పుడెప్పుడో దేశవాళి క్రికెట్లో జనాలు లేకుండా ఆడడం చూసి ఉంటారు ఆటగాళ్లు.. ఇప్పుడు మాత్రం ప్రోత్సహించే ఫ్యాన్స్ ఉండరు.. అయితే ఆ కొరతను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. స్టేడియాల్లో అభిమానులు లేరనే ఫీలింగ్‌ను పోగొట్టేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన కొన్ని లీగుల్లో సీపీఎల్, కౌంటీ లీగుల్లో అభిమానుల్లా కొందరి బొమ్మలను గ్యాలరీల్లో పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.

అయితే ఇంకాస్త విన్నూత్నంగా అంతకుముందు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో అభిమానుల సౌండ్స్ వాడుకుని రికార్డు చేసిన కేరింతలు, అరుపులను వినిపిస్తారని తెలుస్తుంది. ఆటగాళ్లు సిక్సర్లు, బౌండరీలు బాదగానే రికార్డు చేసిన వాయిస్‌లను వినిపిస్తారట. మరికొన్ని ఫ్రాంచైజీలైతే అభిమానులుతో అనుసంధానం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.

Related Posts