ఐపీఎల్ 2020: ఈ ఐదుగురు ఆటగాళ్లపై అంచనాలు ఎక్కువే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆటగాళ్లపై కాసుల వర్షం అభిమానులపై వినోదాల వర్షం కురిపించడానికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభంకాబోతున్నది. యాబై మూడు రోజుల పాటు సగటు క్రికెట్‌ అభిమానిని ఉర్రూతలు ఊగించేందుకు సిద్ధమైంది. అప్పటి వరకూ సహచరులుగా ఉన్న వారు ప్రత్యర్థులైన వేళ, ప్రత్యర్థులుగా ఉన్న వారు సహచరులైన వేళ ఒక వినూత్న వినోదాల విందుతో అభిమానులను అలరించడానికి ఐపీఎల్‌ రంగం సిద్ధం చేసుకుంది.
ప్రతిసారి వేసవిలో ఉర్రూతలూగించే ఐపీఎల్.. ఈసారి మాత్రం కాస్త సీజన్ మార్చుకుంది. ఇప్పటికే బయో బుడగల మధ్య ఆటగాళ్లు ప్రాక్టీస్‌లు కూడాచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభం అవుతుంది.

ఐపిఎల్ 2020 ప్రారంభానికి ముందు, ఈ సీజన్‌లో ప్రభావం చూపగలరని భావిస్తున్న ఐదుగురు టాప్ ప్లేయర్ల గురించి ప్రస్తావన వస్తుంది. వీరిపై అభిమానుల్లో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

డేవిడ్ వార్నర్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్ గతేడాది ఐపీఎల్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. వార్నర్ ఈ సంవత్సరం కూడా అదే మ్యాజిక్ చేయవచ్చు. ఎనిమిది సెంచరీలతో టి 20 క్రికెట్‌లో 282 మ్యాచ్‌ల్లో 9,276 పరుగులు చేసిన వార్నర్ ఈ ఏడాది టి 20 లో పది వేల పరుగులు పూర్తి చేసేందుకు దగ్గరగా ఉన్నాడు. వార్నర్‌కు ఐపిఎల్‌లో 126 మ్యాచ్‌ల్లో 142.39 స్ట్రైక్ రేట్‌లో 4,706 పరుగులు ఉన్నాయి. ఇందులో నాలుగు సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు.

విరాట్ కోహ్లీ:
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కింగ్ కోహ్లీ టోర్నమెంట్‌లో ఈసారైనా కప్ కొట్టాలని కసిగా బరిలోకి దిగుతన్నాడు. ఐపీఎల్ 2016లో కోహ్లీ కేవలం ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. అతని నుంచి ఇలాంటి ప్రదర్శనలను కోహ్లీ అభిమానులు మరోసారి ఆశిస్తున్నారు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న కోహ్లీ, టి20 క్రికెట్‌లో 281 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలతో సహా 8900 పరుగులు చేశాడు.
పాట్ కమ్మిన్స్:
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్.. ఈ సంవత్సరం ఎక్కువగా వినిపిస్తున్న ఫాస్ట్ బౌలర్ పేరు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఈ బౌలర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 వేలంలో రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. టీ20 క్రికెట్‌లో 82 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీసిన కమ్మిన్స్ యుఏఈలో ప్రభావం చూపవచ్చు

IPL 2020 లో అమెరికన్ ప్లేయర్

డ్వేన్ బ్రావో:
ఇటీవల టీ 20 క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ 2020లో డేంజరస్ ప్లేయర్ అని భావిస్తున్నారు. బంతితో, బ్యాట్‌తో బ్రావో యూఏఈ మైదానంలో చెలరేగిపోవచ్చునని అంచనా. ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌ల్లో 147 వికెట్లు తీసిన బ్రావో .. ఈ టోర్నమెంట్‌లో రెండుసార్లు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడుగా ఉన్నారు.క్రిస్ గేల్:
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్లలో ఒకరు క్రిస్ గేల్ తన దూకుడు శైలితో ప్రేక్షకులను ఆకర్షించే బ్యాట్స్‌మెన్. వేగంగా స్కోరు చేసి ఫోర్లు, సిక్సర్లుతో అభిమానులను అలరించడం గేల్ ప్రత్యేకత. గేల్‌కు లీగ్‌లో వేగవంతమైన సెంచరీ, అత్యధిక సిక్సర్లు మరియు ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన పెద్ద రికార్డులు ఉన్నాయి. ఈ సీజన్‌లో గేల్ తుఫాను చూడవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు.

READ  యంగ్ హీరోతో బ్యాడ్మింటిన్ బ్యూటీ గుత్తా జ్వాల ఎంగేజ్ మెంట్, త్వరలోనే పెళ్లి

Related Posts