విరాట్ కోహ్లీ, డివిలియర్స్ పేర్లు మార్చుకున్నారు.. కారణం ఇదే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు వేలాది మంది వైద్యులతో సహా పలువురు ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ కూడా కరోనా కారణంగానే ఏప్రిల్ నుంచి వాయిదా పడి సెప్టెంబర్‌లో జరుగుతుంది.

ఈ క్రమంలో కోవిడ్-19 యుద్ధం చేస్తున్న వీరులను గౌరవించటానికి విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ ట్విట్టర్లో ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభించారు. బెంగళూరు జట్టు ఆటగాళ్లు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ హీరోలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కోవిడ్ హీరోలను గౌరవించటానికి ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు డివిలియర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌ల పేర్లను కూడా మార్చుకున్నారుకరోనా వైరస్ మహమ్మారి సమయంలో కీలక పాత్ర పోషించిన కోవిడ్ వీరుల గౌరవార్థం విరాట్ కోహ్లీ సోమవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌ పేరును సిమ్రాంజిత్ సింగ్‌గా మార్చారు. ఐపిఎల్ సమయంలో, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అవసరమైన వారికి సహాయం చేసే వారిని ఆర్‌సిబి ఆటగాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనను గౌరవిస్తూ కోహ్లీ పేరు మార్చుకున్నాడు.ఈ క్రమంలో, బ్యాట్స్‌మెన్ ఎబీ డివిలియర్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో తన పేరును పరితోష్ పంత్‌గా మార్చుకున్నారు. సీజన్ అంతా తమ చొక్కాల వెనుక భాగంలో “మై కోవిడ్ హీరోస్” సందేశాన్ని ప్రదర్శిస్తామని ఆర్‌సిబి ముందే ప్రకటించింది.

Related Posts