రాహుల్‌కు రెండు లైఫ్‌లు… తప్పు ఒప్పుకున్న కోహ్లీ!

రాహుల్‌కు రెండు లైఫ్‌లు… తప్పు ఒప్పుకున్న కోహ్లీ!

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్ ఆరవ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 97 పరుగుల తేడాతో ఓడించింది. పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ 132 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆర్‌సిబి జట్టు రాహుల్ స్కోరును కూడా చేరుకోలేకపోయింది. 17 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్‌కు కూడా రెండుసార్లు అవుట్ అవ్వాల్సి ఉండగా లైఫ్ లభించింది.

రాహుల్ 82పరుగులు వద్ద ఉన్నప్పుడు ఒకసారి 89 పరుగులు ఉన్నప్పుడు రెండవసారి రాహుల్‌ రెండు క్యాచ్‌లను విరాట్ కోహ్లీ వదిలేశాడు. డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో మొదటిసారి. నవదీప్ సైని బౌలింగ్‌లో రెండవసారి. ఈ రెండు క్యాచ్‌లు మిస్ అయిన ఫలితం రాయల్ ఛాలెంజర్స్ జట్టు గట్టి మూల్యం చెల్లించుకుంది.



మ్యాచ్ తరువాత, కెఎల్ రాహుల్ రెండు క్యాచ్లను పట్టలేకపోవడం మ్యాచ్ తిరగడానికి కారణం అని కోహ్లీ ఒప్పుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ.. రాహుల్ క్యాచ్ మిస్ చెయ్యడం ఓటమికి ప్రధాన కారణం. మేము ఈ క్యాచ్లను కోల్పోకపోతే, మేము 30నుంచి 35 పరుగులు తగ్గించేవాళ్లం. 180 పరుగులు అంటే టార్గెట్ చాలా ఈజీగా ఉండేది అని అన్నారు. కానీ, ఇలాంటివి కొన్నిసార్లు క్రికెట్‌లో జరుగుతూ ఉంటాయి. మన తప్పులను అంగీకరించడం, వాటి నుండి నేర్చుకోవడం. ముందుకు సాగడం మంచిది అని కోహ్లీ అభిప్రాయపడ్డారు.

రెండు లైఫ్‌లను చక్కగా ఉపయోగించుకుని కేఎల్ రాహుల్.. సీజన్లో మొదటి శతకం బాదేశాడు. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 132 పరుగుల ఇన్నింగ్స్‌తో లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు రిషబ్ పంత్ 128 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.