IPL 2020, KXIPvsCSK: మళ్లీ గెలిచిన చెన్నై.. అయినా ఇంటికే

IPL 2020, KXIPvsCSK: మళ్లీ గెలిచిన చెన్నై.. అయినా ఇంటికే

IPL 2020: చెన్నై మళ్లీ గెలిచేసింది. లీగ్ దశలోని చివరి మ్యాచ్ ను ఆడేసింది సూపర్ కింగ్స్. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ కోల్పోయి చేధించేసింది. డుప్లెసిస్ (48; 34బంతుల్లో 4ఫోర్లు) తో వెనుదిరగగా 2సిక్సులు),రుతురాజ్ గైక్వాడ్ (62; 49బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు), అంబటి రాయుడు (30) ఇన్నింగ్స్ ముగిసేవరకూ క్రీజులో నాటౌట్‌గా నిలిచారు.

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. 6 వికెట్లు కోల్పోయి 153పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (29), మయాంక్ అగర్వాల్ (26), గేల్(12), పూరన్(2), మన్ దీప్(14), దీపక్ హుడా(62; 30బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులు), నీషమ్(2), క్రిస్ జోర్డాన్(4)పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. ఠాకూర్, తాహిర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీయగా, లుంగీ ఎంగిడీ 3వికెట్లు పడగొట్టారు.



రాహుల్ సేన ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించక తప్పదు. ఇక టాప్-3లో ఉన్న బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతోపాటు కోల్‌కతాకు ఊరట లభించినట్లే. తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా స్వల్ప తేడాతో గెలిస్తే.. ఢిల్లీ, బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే. ఒకవేళ పంజాబ్ గెలిచినా.. రాజస్థాన్ భారీ విజయం సాధించినా.. ప్రస్తుతం టాప్-3 జట్లుగా ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల్లో ఒక జట్టుకు మూడినట్లే.

చెన్నై ఇప్పటి వరకూ ఆడిన ప్రతి సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్లో మాత్రమే టాప్-4లో నుంచి కూడా నిష్క్రమిస్తోంది.