CSK VS RR IPL Live: రాజస్థాన్ విజయం.. చెన్నై ప్లే ఆఫ్ చేరడం ఇక కష్టమే..

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 06:42 PM IST
CSK VS RR IPL Live: రాజస్థాన్ విజయం.. చెన్నై ప్లే ఆఫ్ చేరడం ఇక కష్టమే..

[svt-event title=”చెన్నైపై రాజస్థాన్ విజయం” date=”19/10/2020,10:56PM” class=”svt-cd-green” ] చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 

ఈ మ్యాచ్‌లో ఓటమితో చెన్నై జట్టు ప్లే ఆఫ్‌ ఆశలు దాదాపుగా గల్లంతు అయ్యాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 8పాయింట్లతో 5వ స్థానంలోకి వచ్చింది. [/svt-event]

[svt-event title=” ఓటమికి చేరువగా చెన్నై.. బట్లర్ ఉతుకుడు.. స్కోరు 108/3(15.0)” date=”19/10/2020,10:43PM” class=”svt-cd-green” ] మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత నిలకడగా ఆడుతున్న రాజస్థాన్ 15 ఓవర్లకు రాజస్థాన్‌ 108పరుగులు చేసింది. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్ధశతకం చేశాడు బట్లర్. స్మిత్‌ (18) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో దాదాపుగా చెన్నై ఓటమికి చేరువగా అయ్యింది. రాజస్థాన్ గెలవాలంటే 30బంతుల్లో 18పరుగులు చేస్తే చాలు. [/svt-event]

[svt-event title=”మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. స్కోరు 31/3(6)” date=”19/10/2020,10:10PM” class=”svt-cd-green” ] చెన్నై నిర్దేశించిన 126పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. పవర్ ప్లే ఆరు ఓవర్లు పూర్తి కాకముందే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన బెన్‌స్టోక్స్‌, రాబిన్‌ ఉతప్ప మొదటి రెండు ఓవర్లలో దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అయితే దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌ చివరి బంతికి బెన్‌స్టోక్స్‌(19) అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్‌ 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత హాజిల్‌వుడ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రాబిన్‌ ఉతప్ప(4) అవుట్ అయ్యాడు. అనంతరం దీపక్‌ చాహర్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి సంజూ శాంసన్‌‌ డకౌట్ అయ్యాడు. లెగ్‌సైడ్‌ ఆడిన షాట్‌ను ధోనీ ఒంటి చేత్తో పట్టుకోగా.. ఆ జట్టు 28 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. [/svt-event]

[svt-event title=”20ఓవర్లలో చెన్నై స్కోరు 125/5″ date=”19/10/2020,9:20PM” class=”svt-cd-green” ] రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20ఓవర్లలో 125పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తియ్యగా.. కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ధోని రనౌట్ అయ్యాడు [/svt-event]

[svt-event title=”జాగ్రత్తగా ఆడుతున్న ధోని, జడేజా 100/4(17)” date=”19/10/2020,9:06PM” class=”svt-cd-green” ] చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న ధోని, జడేజా జాగ్రత్తగా మరో వికెట్ పడకుండా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 17ఓవర్లకు చెన్నై స్కోరు బోర్డుపై 100పరుగుల మార్క్‌ను రీచ్ అయ్యింది. [/svt-event]

[svt-event title=”నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై.. స్కోరు 89/4(15.0)” date=”19/10/2020,8:53PM” class=”svt-cd-green” ] రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కీలకమైన నాలుగు వికెట్లు 56పరుగులకే.. పది ఓవర్లకే కోల్పోయింది. శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన శామ్‌ కరన్‌.. బట్లర్‌ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా.. తర్వాత తెవాటియా బౌలింగ్‌లో రాయుడు షాట్‌కు ప్రయత్నించి వికెట్‌కీపర్‌ శాంసన్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 15ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్లు నష్టానికి 89పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో ధోనీ (17), జడేజా(18) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”డూప్లెసిస్, వాట్సన్ అవుట్.. చెన్నై స్కోరు 43/2(6.0)” date=”19/10/2020,8:08PM” class=”svt-cd-green” ] పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 43పరుగులు చేసింది. డుప్లెసిస్‌ తొమ్మిది బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 10పరుగులు చేసి అవుట్ అవగా.. కార్తీక్‌ త్యాగి వేసిన నాలుగో ఓవర్‌ చివరి బంతికి షేన్‌ వాట్సన్‌(8) ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు కొట్టిన అతడు చివరి బంతికి రాహుల్‌ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై 26 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు జాగ్రత్తగా ఆడుతుండగా.. శామ్ కర్రన్ దూకుడుగా ఆడుతున్నాడు. [/svt-event]

[svt-event title=”తుది జట్లు:” date=”19/10/2020,7:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ధోని ఖాతాలో మరో ఐపీఎల్ రికార్డ్..” date=”19/10/2020,7:18PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌లో చెన్నై టీమ్ ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేర్చిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ప్లేయర్‌గా అరుదైన రికార్డ్‌ ఇవాళ క్రియేట్ చేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 199 మ్యాచ్‌లాడిన ధోనీ 4,568 పరుగులు చేయగా.. ఇందులో చెన్నై టీమ్ తరఫున ఆడుతూ 3,994, రైజింగ్ పుణె టీమ్‌కి ఆడుతూ 574 పరుగులు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో 169 మ్యాచ్‌లాడిన చెన్నై టీమ్ ఏకంగా 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

[/svt-event]

[svt-event title=” Chennai Super Kings XI:” date=”19/10/2020,7:12PM” class=”svt-cd-green” ] S Curran, F du Plessis, S Watson, A Rayudu, MS Dhoni, R Jadeja, K Jadhav, J Hazlewood, P Chawla, D Chahar, S Thakur [/svt-event]

[svt-event title=” Rajasthan Royals XI: ” date=”19/10/2020,7:11PM” class=”svt-cd-green” ] R Uthappa, B Stokes, S Samson, S Smith, J Buttler, R Parag, R Tewatia, J Archer, S Gopal, A Rajpoot, K Tyagi [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన చెన్నై.. బ్యాటింగ్!” date=”19/10/2020,7:05PM” class=”svt-cd-green” ] IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో 37వ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ సీజన్‌లో రెండోసారి తలపడుతున్నాయి. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

[/svt-event]

[svt-event title=”అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో:” date=”19/10/2020,7:03PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో 37 వ మ్యాచ్ రాత్రి 7:30 నుంచి అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటివరకు, ఈ సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన నిరాశపరిచింది. చెన్నై మరియు రాజస్థాన్ ఇప్పటివరకు 9–9 మ్యాచ్‌లు ఆడాయి, రెండూ కేవలం 3–3 మ్యాచ్‌ల్లోనే గెలిచాయి. పాయింట్ల పట్టికలో చెన్నై ఏడవ స్థానంలో, రాజస్థాన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. [/svt-event]

[svt-event title=”కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్లే:” date=”19/10/2020,6:42PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 37 వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. 9 మ్యాచ్‌లు ఆడిన తరువాత, ఇరు జట్ల ఖాతాలో 3 విజయాలు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు టోర్నమెంట్ ప్రయాణం దాదాపుగా ముగుస్తుంది. ప్లే ఆఫ్ ఆశలు ఆవిరి అయిపోతాయి. [/svt-event]