IPL 2020, దుమ్ము రేపిన చెన్నై సూపర్ కింగ్స్

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 06:30 AM IST
IPL 2020, దుమ్ము రేపిన చెన్నై సూపర్ కింగ్స్

Indian Premier League (IPL) 2020 : ఎప్పుడెప్పుడా ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమౌతాయా అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. IPL 2020 మ్యాచ్ లు 2020, సెప్టెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.



ఇందులో చెన్నై టీం దుమ్ము రేపింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో చెన్నై క్రీడాకారులు రాణించడంతో ముంబై జట్టు పరాజయం పాలైంది. ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) లతో సత్తా చాటాడు. ఇతనికి డుప్లెసిస్( 58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) సహకరించాడు.



టాస్ గెలిచిన చెన్నై : –
తొలుత చెన్నై సూపర్ కింగ్ టాస్ గెలిచింది. ముంబై జట్టు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 162 Runs చేయగలిగింది. లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన CSKకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్‌(1), షేన్‌ వాట్సన్‌(4) వికెట్‌లను కోల్పోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రాయుడు..బ్యాట్ ను ఝలిపించాడు. బాల్ ను సరిగ్గా అంచనా వేస్తూ..పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు.



రాయుడు 71 రన్లు :-
చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఇలా..33 బంతుల్లోనే (6 ఫోర్లు, 2 సిక్స్) లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతనికి డుప్లెసిస్ చక్కగా సహకరించాడు. ఇద్దరు భాగస్వామ్యంతో 100 పరుగుు సాధించారు. వీరిని విడదీయడానికి ముంబై బౌలర్లు ప్రయత్నించినా విఫలమయ్యారు. 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయుడు (71 పరుగులు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.



డుప్లెసిస్ కు లక్ లు : –
డుప్లెసిస్ రెండు, మూడు సార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు. రాయుడు అనంతరం వచ్చిన సామ్ కరన్ (18), మ్యాచ్ ను తమ వైపుకు లాక్కొన్నాడు. ఇతడిని బుమ్రా అవుట్ చేశాడు. అయినా..సరే..డుప్లెసిస్ సమర్థవంతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతను 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ధోని వచ్చినా..ఎలాంటి పరుగులు చేయలేదు. తొలి మ్యాచ్ లో చెన్నై బోణి కొట్టింది.



ముంబై జట్టు బ్యాటింగ్ : – 
అంతకంటే ముందు..ముంబై బ్యాటింగ్ ఆరంభించింది. అనూహ్యంగా జట్టులో ప్లేస్ సంపాదించిన సౌరభ్ తివారి (42) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై జట్టు ఊపు చూస్తే..భారీ స్కోరు ఖాయం అనుకున్నారు అంతా. 12 ఓవర్లలో 100 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ (12) నిరాశపరిచాడు. డికాక్ (33, 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు.



భారీ స్కోరు దిశగా ముంబై : – 
ప్రమాదకరంగా మారుతున్న ఇతడిని కరన్ అవుట్ చేశాడు. సూర్యకుమార్ (17), హార్థిక్ పాండ్యా (14), పొలార్డ్ (18) పరుగులు మాత్రమే చేశారు. సౌరభ్, హార్థిక్ లు మంచి ఊపులో కనిపించారు. ఈ తరుణంలో ముంబై జట్టు 180 పరుగులు చేస్తుందని భావించారు.



చివరిలో ప్రతాపం చూపిన చెన్నై బౌలర్లు : – 
చెన్నై ఫాస్ట్ బౌలర్ ఎంగిడి తన ప్రతాపం చూపించాడు. చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జడేజా సైతం చివరిలో 2 వికెట్లు తీశాడు. అనుకున్న తక్కువ స్కోరుకే ముంబై జట్టును కట్టుదిట్టం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 రన్లు సాధించింది.