శ్రేయాస్ అయ్యర్ లగ్జరీ కార్లు.. BMW నుంచి Audi S5 వరకూ

శ్రేయాస్ అయ్యర్ లగ్జరీ కార్లు.. BMW నుంచి Audi S5 వరకూ

Shreyas Iyer: అతి పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సెలబ్రిటీల్లో శ్రేయాస్ అయ్యర్ ఒకరు. మంగళవారం జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గట్స్ ఉన్న కెప్టెన్. టీమిండియాలో ఎక్కువ మ్యాచ్‌లలో కనిపించకపోయినా అతని లైఫ్‌లో లావిష్ లైఫ్ స్టైల్ ఏ మాత్రం తక్కువ కాదు.

గతేడాది ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. అతని దగ్గర ఉన్న లగ్జరీ కార్ల గురించి ఇలా చెప్పాడు. ‘నా టీమ్‌మేట్ సూర్యకుమార్ యాదవ్‌తో కార్ల గురించి చర్చించా. ఎందుకంటే అతను కొన్ని కార్లను మాడిఫై చేయిస్తూ ఉంటాడు. పసుపు కలర్ నుంచి నలుపుకు, ఆరెంజ్ కలర్‌కు మార్చాడు.



వాటి మెయింటైనెన్స్ విషయంలోనూ అతనికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు. ఇంకా అతని కలెక్షన్లలో మూడు లగ్జరీ కార్లు ఉన్నాయి. అండర్-19 క్రికెట్ ఆడుతున్న సమయం నుంచి వచ్చిన సంపాదనతో వీటిని గ్యారేజిలో చేర్చుకున్నాడు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

1. Hyundai i20 Sportz
నేను కొన్న తొలి కారు Hyundai i20 Sportz. ‘అండర్-19 క్రికెట్ ఆడిన తర్వాత వచ్చిన కొన్ని డబ్బులతో ఇది కొనుక్కున్నా. ఇంటికన్నా కార్ కొంటేనే బెటర్ అనుకున్నా’ అని అయ్యర్ చెప్పాడు. రెండేళ్లుగా ఇండియన్ మార్కెట్లో Hyundai i20 Sportzకు మంచి డిమాండ్ నడుస్తుంది.

Hyundai-i20-Sportz-shreyas

2. Audi S5
అతని తొలి కారు Hyundai i20 Sportz అయితే లేటెస్ట్ కారు Audi S5. ‘నార్డ్ గ్రే కలర్ ఆడి ఎస్5కారు స్పీడ్ అంటే నాకు ఇష్టం. అది వేగం పుంజుకునే తీరు, బ్రేక్ వేసినప్పుడు ఆగిపోయే తీరు చాలా ఇష్టం. దీని పికప్ అద్భుతం. 4.5సెకన్లలోనే 0-100వరకూ స్పీడ్ వెళ్తుంది. నేను డ్రైవ్ చేసిన వాటిల్లో బెస్ట్ కార్ ఇదే’ అని శ్రేయాస్ అంటున్నాడు.

Audi-S5-shreyas

3. BMW
మరో ఇంటర్వ్యూలో అతని వద్ద ఉన్న కాస్ట్లీ కార్ బీఎండబ్ల్యూ కార్ అని చెప్పాడు. మోడల్ గురించి చెప్పకపోయినా బీఎండబ్ల్యూ కార్లు కనీసం రూ.35లక్షల కంటే ఎక్కువ ధర నుంచే మొదలవుతాయి.

BMW-shreyas