అతను కుర్ర కోహ్లీలా కనిపిస్తున్నాడు: డుప్లెసిస్

అతను కుర్ర కోహ్లీలా కనిపిస్తున్నాడు: డుప్లెసిస్

Virat Kohli: చెన్నై సూపర్ కింగ్స్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన డుప్లెసిస్ యంగ్ ఓపెనర్‌కు కాంప్లిమెంట్ ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్‌ను విరాట్ కోహ్లీతో పోలుస్తూ.. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కుర్రకోహ్లీలా కనిపిస్తున్నాడని అన్నారు. 62పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ తో పంజాబ్‌ను.. చెన్నై 9వికెట్ల తేడాతో పడగొట్టింది.

రుతురాజ్ ఆరు ఫోర్లు, సిక్సు బాది 154పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కీలకమైయ్యాడు. మ్యాచ్ ఫలితంగా చెన్నైకు 12పాయింట్లు వచ్చి చేరాయి. అంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సమానం.



‘రుతురాజ్ గైక్వాడ్ కుర్ర కోహ్లీలా కనిపిస్తున్నాడు. కాదంటారా?’ అని మ్యాచ్ అనంతరం క్వశ్చన్ చేస్తూ ఈ మహారాష్ట్ర ఓపెనర్‌కు కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 48పరుగులు పూర్తి చేసి సీజన్ మొత్తంలో సీఎస్కే తరపున 449పరుగులు చేయగలిగాడు.
https://10tv.in/shocking-this-is-how-much-virat-kohli-earns-for-a-single-paid-instagram-post/
ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టే ప్లేయర్ ఉండగా.. అంతకుమించి ఏం కావాలి. నెక్స్ట్ లెవల్‌లో ఆడే ప్లేయర్లు ఉన్నప్పుడు ఆ యంగ్ ప్లేయర్లలో క్వాలిటీ కనిపిస్తుంది’ అని డుప్లెసిస్ అన్నాడు.