KKR vs CSK : చెన్నైకి నో ఛాన్స్.. గెలిస్తేనే కోల్‌కతా ప్లే ఆఫ్‌కు!

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 07:47 PM IST
KKR vs CSK : చెన్నైకి నో ఛాన్స్.. గెలిస్తేనే కోల్‌కతా ప్లే ఆఫ్‌కు!

KKR vs CSK : ఐపీఎల్‌ 2020 సీజన్‌లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు చెన్నై కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోల్ కతాకు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.



ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో 5 స్థానంలో ఉంది. పంజాబ్‌కు రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కేకేఆర్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది.



ఈ మ్యాచ్‌లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్ స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్‌ శర్మ తుది జట్టులోకి వచ్చారు. అలాగే కోల్ కతా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ప్రసిద్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ తుది జట్టులోకి వచ్చాడు.

కోల్ కతా (KKR) :
శుభమన్‌ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ , ఇయాన్ మోర్గాన్(కెప్టెన్‌), రింకు సింగ్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్.



చెన్నై (CSK) :
రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్‌), జగదీషన్, సామ్ కరాన్, రవీంద్ర జడేజా, , దీపక్ చాహర్, లుంగీ ఎన్గిడి, మిచెల్ సాంట్నర్, కరణ్‌ శర్మ.