IPL 2020: పరువు నిలబెట్టుకున్న ఢిల్లీ

IPL 2020: పరువు నిలబెట్టుకున్న ఢిల్లీ

ముంబైకు 157 పరుగుల టార్గెట్ నిర్దేశించి పరువు నిలబెట్టుకుంది ఢిల్లీ. ఆరంభంలో తడబడి వికెట్లు కోల్పోయినప్పటికీ శ్రేయాస్-పంత్‌లు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. స్కోరు బోర్డు పరుగులు తీస్తుందనుకున్న సమయంలో పంత్ అవుట్ అవడంతో జట్టు సమస్యల్లో పడింది.

IPL 2020 సీజన్ ఫైనల్‌లో ముంబైపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోవడంతో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు మార్కస్ స్టోనిస్. ఆ తర్వాత స్వల్ప విరామానికే ధావన్(15), రహానె(2)అదే బాటపట్టారు.



బౌల్ట్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి రహానె అవుట్ అవడంతో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(65: 50బంతుల్లో ) చివరి వరకూ క్రీజులో నిలిచాడు. పంత్ భాగస్వామ్యంలో ఇన్నింగ్స్ కాస్త కుదుట పడ్డట్లు అనిపించింది. 14.6వ బంతికి షాట్ కు యత్నించిన పంత్(56; 38బంతుల్లో, 4ఫోర్లు, 2సిక్సులు).. హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత దిగిన హెట్ మేయర్(5), అక్సర్ పటేల్(9), రబాడ(0)లకే పరిమితమవడంతో జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు నష్టపోయి 156పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుని చేధనకే మొగ్గు చూపేసరికి ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యంగా అనిపించదట.