IPL 2020: మోగింది ముంబై ఇండియన్స్ విజయఢంకా..

IPL 2020: మోగింది ముంబై ఇండియన్స్ విజయఢంకా..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. సీజన్లో రెండో మ్యాచ్ ను కోల్‌కతాతో ఆడి 49 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్దేశించిన 196పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించింది. దీంతో ఐపీఎల్ లో కేకేఆర్ పై మరోసారి ముంబై పైచేయి సాధించినట్లు అయింది.

ముంబై బౌలర్ల సమష్టి కృషితో కోల్ కతా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, బుమ్రా, రాహుల్ చాహర్ తలో రెండు వికెట్లు తీయగా పొలార్డ్ ఒక వికెట్ చేజిక్కుంచుకున్నాడు. చేధనలో కోల్ కతా బ్యాట్స్ మెన్… పాట్ కమిన్స్ ఒక్కడే 33పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్(30)మాత్రమే చేయగలిగాడు. ఓపెనర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమై నిరుత్సాహపరచగా జట్టు పేలవంగా ఇన్నింగ్స్ ను పూర్తి చేసుకుంది.

తొలి గెలుపు

అంతకంటే ముందు జరిగిన ఇన్నింగ్స్ లో ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 195పరుగులు చేయగలిగింది. 10ఓవర్ల స్కోరును బట్టి చూస్తే 200కి మించి నమోదు చేస్తుందని భావించారు. క్వింటాన్ డికాక్ స్వల్ప స్కోరుతోనే వెనుదిరిగినప్పటికీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. కోల్ కతాకు కౌంటర్ అటాక్ ఇచ్చి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. సెకండ్ వికెట్ 90 పరుగులు జోడించారు. 18వ ఓవర్లో రోహిత్ వెనుదిరగడంతో ఒక్క బౌండరీ సాధించడం కూడా కష్టంగానే మారింది.

ఓ మాదిరి టార్గెట్ అందించిన ముంబైతో మ్యాచ్ రసవత్తరంగానే మారింది. గతంలో కోల్‌కతా చేధించి గెలిచిన టార్గెట్లు ఇలా ఉన్నాయి. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 206, 2014 ఫైనల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో 200, 2012ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో 191చేయగలిగాయి.