ఫైనల్ కోసం.. ముంబైతో ప్లే ఆఫ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ

ఫైనల్ కోసం.. ముంబైతో ప్లే ఆఫ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ

IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై 10వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. గురువారం జరగనున్న ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరోసారి తలపడనుంది.




మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఐపీఎల్ టేబుల్‌లో టాప్ పొజిషన్ లోనే కొనసాగుతుంది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ పాండ్యా లాంటి బెస్ట్ ప్లేయర్లతో ధీటుగా కనిపిస్తుంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ ఫలితాన్ని పాజిటివ్ గా తీసుకుని కాలి కండరం గాయంతో బాధపడుతున్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటర్న్‌తో మ్యాచ్‌కు రెడీ అయింది.

క్వింటాన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి టాపార్డర్‌తో ముంబై ఇండియన్స్ పటిష్ఠంగా ఉంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ గాయాలపాలైన ప్లేయర్లను రెస్ట్ తీసుకోవాలని సూచిస్తుంది.




స్పిన్నర్లు రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యాల పర్‌ఫార్మెన్స్ సైతం ఎక్సిలెంట్ గా ఉంది.
https://10tv.in/its-not-how-you-talk-about-friends-joe-biden-on-trumps-filthy-air-in-india-comment/
ఢిల్లీలో అవే సమస్యలు:
సీజన్ మొత్తంలో చూస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ సెటిల్డ్‌గా, కన్విన్సింగ్‌గా కనిపిస్తుంది. నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయి ఐపీఎల్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరింది. కానీ, ప్లే ఆఫ్ రేసులో పోటీకి మాత్రం సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి.

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే 25పరుగులు మించి చేశాడు. అదే 6 మ్యాచ్‌లలో పృథ్వీ షా 30పరుగులు మాత్రమే చేశాడు.

అజింకా రహానె వన్ డ్రాప్ లో వస్తున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే సమయంలో ధావన్ తిరిగి ఫామ్ దక్కించుకోవడంతో హెల్ప్ అయింది. యూఏఈ లాంటి స్లో పిచ్ లపై ఢిల్లీకి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా లోటు కనిపిస్తూనే ఉంది. రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ లు ఆర్సీబీలో ఆడిన తీరు ఎంకరేజింగ్ గా ఉంది.




ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు ఛాంపియన్ అయిన ముంబైపై గెలిచిందా ఫైనల్ కు చేరేందుకు మరింత జోష్ లభించినట్లే.