మరో పదేళ్లకు సెట్ అయ్యే ప్లేయర్లను తీసుకుంటాం : ఎంఎస్ ధోనీ

మరో పదేళ్లకు సెట్ అయ్యే ప్లేయర్లను తీసుకుంటాం : ఎంఎస్ ధోనీ

ms-dhoni

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2020లో చివరి మ్యాచ్ ఆడేసింది. ముగింపులో మూడు మ్యాచ్ లు గెలిచి ఆశ్చర్యపరిచింది. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై మ్యాచ్ గెలిచి తాను మాత్రమే వెళ్లిపోకుండా పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను కూడా గల్లంతు చేసింది.

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. జట్టు మరింత ముందుకు వెళ్లాలంటే కీలక మార్పులు తప్పవని సూచించాడు. ‘ఇది చాలా క్లిష్టమైన సమస్య. మేం పూర్తి సామర్థ్యంతో ఆడామని అనుకోవడం లేదు. టోర్నమెంట్లో పలు సందర్భాల్లో చాలా తప్పులు చేశాం’ అని ధోనీ పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.

చివరి 4గేమ్స్ ఆడిన తీరులో ముందే పర్‌ఫార్మ్ చేస్తే వేరే స్థానంలో ఉండేవాళ్లం. చాలా వెనకబడిపోయాం. ప్రేరేపించుకోవడం చాలా క్లిష్టమైన పని. అలాంటి చోటే ప్రతిఒక్కరూ కంట్రిబ్యూట్ చేయగలరు. వారి క్రికెట్ ను వాళ్ల స్టైల్ లో ఆడటం గర్వంగా అనిపించింది’ అని ధోనీ అన్నాడు.

6-7గేమ్స్ కష్టం అనిపించొచ్చు. కానీ, ఆ క్రికెట్ డ్రెస్సింగ్ రూంలో ఎంజాయ్ చేయడానికి పనికిరాదు. డిఫరెంట్ ఐడియాలతో రావడం అవసరం. డ్రెస్సింగ్ రూం వాతావరణం బాగాలేకపోతే అది చాలా ఇబ్బందిగా మారిపోతుంది’ అని చెప్పాడు.

రాబోయే సంవత్సరం సీఎస్కే యువతరానికి బాధ్యతలు అప్పగించే పని పెట్టుకుంది. బీసీసీఐ నిర్ణయించిన వేలాన్ని బట్టి మరో పదేళ్ల వరకూ పనికొచ్చే జట్టును ఎంచుకుంటాం. ఐపీఎల్ స్టార్టింగ్ లో తీసుకున్న జట్టు మాకు బాగా కలిసొచ్చింది. మనం మారాల్సిన సమయం వచ్చినప్పుడు దానిని నెక్స్ట్ జనరేషన్‌కు అప్పగించాలి’ అని ధోనీ ముగించాడు.