MI vs KXIP: ముంబైపై పంజాబ్ సూపర్ డూపర్ విజయం

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 01:11 AM IST
MI vs KXIP: ముంబైపై పంజాబ్ సూపర్ డూపర్ విజయం

KXIP won in 2nd Super Over: ఐపిఎల్ 2020లో 36వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండవ సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టంతో 176 పరుగులు చేసింది. అనతరం 177పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. షెడ్యూల్ చేసిన 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. రెండు జట్లు స్కోర్లు సమానం కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లాయి ఇరు జట్లు.. ఆ ఓవర్‌లో కూడా టై అయిన తర్వాత మరో సూపర్ ఓవర్ ఆడాయి ఇరు జట్లు.



వాస్తవానికి, మొదటి సూపర్ ఓవర్లో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి సూపర్ ఓవర్‌లో ముంబైకు టార్గెట్ ఇచ్చేందుకు పంజాబ్‌ జట్టు తరఫున కేఎల్ రాహుల్, పూరన్ క్రీజులోకి రాగా.. బూమ్రా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్‌లో 6 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసి ముంబైకి టార్గెట్ 6 బంతుల్లో 6పరుగులుగా ఫిక్స్ చేసింది పంజాబ్. దీని తరువాత, ముంబై ఇండియన్స్ కూడా సూపర్ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే చేసింది. ఈ విధంగా, సూపర్ ఓవర్ టై అయిన తరువాత, మరో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేల్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధం అయ్యాయి.



రెండవ సూపర్ ఓవర్ ఆడేందుకు ముంబై జట్టు నుంచి పాండ్యా, పోలార్డ్ క్రీజులోకి వచ్చారు. పంజాబ్ జట్టు నుంచి జోర్దాన్ బౌలింగ్ చేయగా.. ఓవర్‌లో ఒక వికెట్ కోల్పోయి.. 11 పరుగులు చేసింది ముంబై జట్టు. అనంతరం క్రిస్ గేల్ మరియు మయాంక్ అగర్వాల్ పంజాబ్ తరఫున బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. గేల్ మొదటి బంతికి ఒక సిక్సర్ కొట్టాడు, తరువాత ఒక సింగిల్ తీసుకున్నాడు. దీని తరువాత మయాంక్ రెండు ఫోర్లు కొట్టి పంజాబ్ జట్టును గెలిపించాడు. ఈ విధంగా పంజాబ్ రెండో సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచింది.



అంతకు ముందు, టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్‌కు దిగగా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లో 53 పరుగులు (3 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేయగా.. రోహిత్ శర్మ 9, సూర్యకుమార్ యాదవ్ 0, ఇషాన్ కిషన్ 7, హార్దిక్ పాండ్యా 8 మాత్రం మ్యాచ్‌లో పెద్దగా పరుగులు సాధించలేదు.



మిడిల్ ఆర్డర్లో వచ్చిన కృనాల్ పాండ్యా 34 పరుగులు చేయగా.. చివర్లో పొలార్డ్ 12 బంతుల్లో 34, కౌంటర్‌నైల్ 12 బంతుల్లో 24 పరుగులు చెయ్యడంతో ముంబై స్కోర్‌ 164కి చేరుకుంది. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్‌కు చెరో వికెట్ దక్కింది.



అనంతరం 177పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనింగ్ అదరగొట్టింది. అయితే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నాలుగో ఓవర్లో కేవలం 11 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. తర్వాత క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. కానీ 10వ ఓవర్లో 75 పరుగుల స్కోరుపై సిక్సర్ కొట్టే ప్రయత్నంలో గేల్ బౌండరీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గేల్ 21 బంతుల్లో 24 పరుగులు చేయగా.. అందులో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి.



గేల్ అవుట్ అయిన తరువాత, నికోలస్ పురాన్ ముంబై బౌలర్లపై దాడి చేశాడు. పురన్ 12 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. కానీ బుమ్రా ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత వెంటనే గ్లెన్ మాక్స్‌వెల్ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ కెఎల్ రాహుల్ మాత్రం ముంబై బౌలర్లపై దాడి చేస్తూనే ఉన్నాడు. 51 బంతుల్లో 77 పరుగుల(7ఫోర్లు, మూడు సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే బూమ్రా వేసిన 18 ఓవర్‌లో మూడవ బంతికి 153పరుగులు స్కోరు బోర్డుపై ఉండగా.. రాహుల్ అవుట్ అయ్యాడు.



దీంతో చివరి 15 బంతుల్లో పంజాబ్‌కు 24 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్ బాగా ఆడారు. అయితే 20వ ఓవర్ చివరి బంతికి రెంగు పరుగులు తియ్యబోయి జోర్దాన్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయలేకపోవడంతో మ్యాచ్ సమం అయింది. దీని తరువాత, మ్యాచ్ ఫలితం పొందడానికి రెండు సూపర్ ఓవర్లు ఆడారు, దీనిలో చివరికి పంజాబ్ గెలిచింది. ముంబై తరపున బూమ్రా మూడు వికెట్లు, రాహుల్ ఛాహర్ రెండు వికెట్లు తీసుకున్నారు.